Ram Charan : గౌతమ్ తిన్ననూరికి టార్గెట్ ఫిక్స్ చేసిన రామ్ చరణ్..హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారో తెలుసా..?

Published : Dec 26, 2021, 05:45 AM IST
Ram Charan :  గౌతమ్ తిన్ననూరికి టార్గెట్ ఫిక్స్ చేసిన రామ్ చరణ్..హీరోయిన్ గా ఎవరిని తీసుకున్నారో తెలుసా..?

సారాంశం

రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరికి టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాను కంప్లీట్ చేయడం కోసం ఒక టైమ్ ను గౌతమ్ కు చరణ్ ఫిక్స్ చేశాడట. ఇక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దాదాపు కన్ ఫార్మ్ అయినట్టే అంటున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan)  ప్రస్తుతం  శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఇంతవరకూ రెండు షెడ్యూల్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాతో పాటు చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్(RRR) తో పాటు ఆచార్య సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశాడు చరణ్. అయితే శంకర్(Shankar) తో చేస్తున్న సినిమాను వచ్చే ఏడాది  జూన్ కి షూటింగును పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూశారు.

 

కాని ఇంతలో శంకర్ వివాదాల వల్ల సగంలో ఆపేసిన కమల్ హాసన్ (Kamal Hasan) ఇండియన్ 2 సినిమాకి లైన్ క్లియర్ కావడంతో అటువైపు వెళ్లిపోయాడు. ఆరు నెలల పాటు రామ్ చరణ్ సినిమా షూటింగు వాయిదా పడినట్టేనని అంటున్నారు. ఈ లోగా ఎవరికి వారు ఆ తరువాత చేయవలసిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. చరణ్ (Ram charan) కూడా గౌతమ్ తిన్ననూరి సినిమాను కంప్లీట్ చేయాలని అనకుంటున్నాడట. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించి, శంకర్ వచ్చే లోగా పూర్తిచేయాలని గౌతమ్ కు చరణ్ టార్గెట్ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది.  

Also Read : Samanth : యశోద మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్న సమంత... తగ్గేదే లేదంటుంది.

దాంతో ఆ దిశగా సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయి గా బాలీవుడ్ బ్యూటీ  దిశా పటాని(Dishapatani) పేరును పరిశీలిస్తున్నారట. దాదాపు ఆమె పేరే ఖరారు కావొచ్చని అంటున్నారు. 'లోఫర్' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తరువాత తెలుగు సినిమాలు చేయలేదు. చాలా గ్యాప్ తరువాత చరణ్ జోడీగా నటించబోతుంది. త్వరలో ఈ మూవీకి సంబందించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్