వంశీ ఫ్యాషన్ డిజైనర్ సనాఫ్ లేడీస్ టైలర్ విడుదల తేదీ ఖరారు

Published : May 05, 2017, 11:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
వంశీ ఫ్యాషన్ డిజైనర్ సనాఫ్ లేడీస్ టైలర్ విడుదల తేదీ ఖరారు

సారాంశం

లేడీస్ టైలర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాషన్ డిజైనర్ ఈ ఫ్యాషన్ డిజైనర్ సనాఫ్ లేడీస్ టైలర్ జూన్2న ఈ చిత్రాన్ని విడుదల చేసేంందుకు నిర్ణయం

దర్శకుడు వంశీ కెరీర్లో అతి పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం, హీరోగా రాజేంద్రప్రసాద్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘లేడీస్ టైలర్’. 1985 లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వంశీ. ఇందులో యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం యొక్క పోస్టర్లకు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది.

 

తాజాగా ఈ సినిమాను జూన్ 2వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కొద్దిసేపటి క్రితమే ఈ తేదీని అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో అశ్విన్ సరసన అనీషా ఆంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో దర్శకుడు వంశీ పూర్వ వైభవాన్ని చాటుకుంటాడని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా