మహేష్ బాబు గురించి సుకుమార్ షాకింగ్ కామెంట్స్, ఎప్పుడూ ఇంత జోష్ చూడలేదన్న డైరెక్టర్,

Published : May 07, 2022, 09:28 PM IST
మహేష్ బాబు గురించి సుకుమార్ షాకింగ్ కామెంట్స్,  ఎప్పుడూ ఇంత జోష్ చూడలేదన్న డైరెక్టర్,

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ కాంబినేషన్ మూవీ సర్కారువారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ సాంగ్ ను రిలీజ్ చేసిన జీనియర్ డైరెక్టర్ సుకుమార్.. మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ కాంబినేషన్ మూవీ సర్కారువారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఓ సాంగ్ ను రిలీజ్ చేసిన జీనియర్ డైరెక్టర్ సుకుమార్.. మహేష్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ నిండిపోయింది. సర్కారువారి పాట ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్, వీరితో పాటు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, వంశీ పైడి పల్లి కూడా సందడి చేస్తున్నారు. ఇక ఈమూవీలో ఓపాటను సుకుమార్ రిలీజ్ చేశారు. 

సర్కారువారి పాటలో సాంగ్ ను రిలీజ్ చేసిన సుకుమార్ మహేష్ బాబుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ పాటను తాను ముందే చూసేశానని, సూపర్ స్టార్ లో ఇంత జోష్ నేను ఎప్పుడూ చూడలేదన్నారు. మహేష్ ను ఇలా చూపించిన క్రెడిట్ డైరెక్టర్ పరశురామ్ కే దక్కుతుందన్నారు సుకుమార్. ఇక నుంచి సూపర్ స్టార్ ను ప్రతీ సినిమాలో ఇలానే  జోష్ తో చూడాలని అనుకుంటున్నట్టు సుకుమార్ వెల్లడించారు. 

ఇక సర్కారువారి పాట డైరెక్టర్ పరశురామ్ గురించి కూడా మాట్లాడారు సుకుమార్. పరశురామ్ డైలాగ్స్ బాగుంటాయని.. తను రాసినట్టు ఇండస్ట్రీలో ఎవరు రాయలేరన్నారు. పరశురామ్ అసిస్టెంట్ గా ఉన్నప్పటి నుంచీ తనకు తెలుసన్నారు. ఈసినిమా సూపర్ హిట్ అవుతుందని... పరశురామ్ కు ఆడియన్స్ మెచ్చేలా ఎలా డైలాగ్స్ రాయాలో తెలుసన్నారు సుకుమార్. 

మరోసారి మహేష్ గురించి మాట్లాడుతూ.. ఆయన డైరెక్టర్స్ ను కంఫర్ట్ జోన్ లో ఉంచే హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో తనకు వన్ నేనొక్కడినే అవకాశం ఇచ్చారని... మహేష్ కు థ్యాంక్స్ చెప్పారు సుకుమార్. తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అన్నారు. పాటలన్నీ అద్భుతంగా చేశారన్నారు సుకుమార్ 

ఇక మే 12న రిలీజ్ కాబోతున్న ఈసినిమాను మైత్రీ మూవీస్ బ్యానర్ తో పాటు మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సర్కారువారి పాట సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటి వరకూ వచ్చిన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కళావతి పాట అంతటా..మారు మోగిపోతోంది. ఇక రీసెంట్ గా ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది టీమ్. 

ఒక్కో డైలాగ్ గట్టిగా పేలడంతో సూపర్ స్టార్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మూవీ టీమ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ ను గట్టిగానే చేస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తి సురేష్ తో పాటు డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. ఇక నుంచి సూపర్ స్టార్ కూడా  వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే