Vijay Deverakonda: `లైగర్‌`, `ఎఫ్‌3`, `మేజర్‌`, `అంటే సుందరానికి` చిత్రాలకు విజయ్‌ బర్త్ డే బంపర్‌ ఆఫర్‌

Published : May 07, 2022, 06:43 PM IST
Vijay Deverakonda: `లైగర్‌`, `ఎఫ్‌3`, `మేజర్‌`, `అంటే సుందరానికి` చిత్రాలకు విజయ్‌ బర్త్ డే బంపర్‌ ఆఫర్‌

సారాంశం

విజయ్‌ దేవరకొండ చేసే ప్రతి ఒక్కటి డిఫరెంట్‌గా ఉంటుంది. ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ ఆలోచిస్తుంటారు.అదే ఆయన్ని టాలీవుడ్‌లో ప్రత్యేకంగా ఉంచింది. తాజాగా మరోసారి తన ప్రత్యేకతని చాటుకున్నారు విజయ్‌. 

విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) త్వరలోనే పాన్‌ ఇండియా స్టార్‌ కాబోతున్నారు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లాగే తను కూడా ఇండియా వైడ్‌ పాపులారిటీని పొందబోతున్నారు. `లైగర్‌` సినిమాతో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం `లైగర్‌` (Liger) ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. ఈ సినిమా హిట్‌ అయితే విజయ్‌ ఇండియా వైడ్‌గా పాపులర్‌ అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో `డియర్‌ కామ్రేడ్‌`తో చిన్న ప్రయోగం చేశారు. కానీ అంతగా వర్కౌట్‌ కాలేదు. కానీ ఇప్పుడు `లైగర్‌`తో ఏకంగా పాన్‌ ఇండియా ఇమేజ్‌ని కొట్టేయబోతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ నెల(మే)9న విజయ్‌ దేవరకొండ పుట్టిన రోజు (Vijay Birthday). ఈ సందర్భంగా తాను నటించిన `లైగర్‌` చిత్రం నుంచి అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలోని ఓ థీమ్‌ సాంగ్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. లైగర్‌ హంటింగ్‌ పేరుతో దీన్ని సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. తాజాగా దీని అప్‌డేట్‌ ఇచ్చారు. మరోవైపు  తన బర్త్ డేకి సంబంధించి విజయ్‌ దేవరకొండ చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది.  

విజయ్‌ దేవరకొండ చేసే ప్రతి ఒక్కటి డిఫరెంట్‌గా ఉంటుంది. ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ ఆలోచిస్తుంటారు. బోల్డ్ గానూ ఉంటారు. అదే ఆయన్ని టాలీవుడ్‌లో ప్రత్యేకంగా ఉంచింది. తాజాగా మరోసారి తన ప్రత్యేకతని చాటుకున్నారు విజయ్‌. తనకు ఎక్కువైన పవర్‌ని ఇతర సినిమాలకు పంచుతున్నట్టు ట్వీట్‌ చేశారు. `నా పుట్టిన రోజు సందర్భంగా చాలా సినిమాలు ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్నాయి. దీంతో ఇది ఒక పండగలాగా మారిపోయింది. అందరికి విజయ్‌ దేవరకొండ సెంటిమెంట్‌ ఎక్కువైపోయింది. అందరు బాగుండాలి. నా పవర్‌ని `లైగర్‌`, `విడి11`, `మేజర్‌`, `ఎఫ్‌3`, `అంటే సుందరానికి`, `పృథ్వీరాజ్‌` చిత్రాలకు పంచుతున్నా` అంటూ ట్వీట్‌ చేశారు విజయ్‌. ఈ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. విజయ్‌ ప్రత్యేకతకి, గొప్ప హృదయానికి అభిమానుల నుంచి విషెస్‌ అందుతుంది. 

విజయ్‌ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `లైగర్‌` చిత్రంలో అనన్య పాండే కథానాయికగా నటించింది. పూరీ జగన్నాథ్‌, ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలో తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు. ఆగస్ట్ 25న ఈ సినిమా రిలీజ్‌ కాబోతుంది. ఓ ముంబయి వీధుల్లోని ఛాయ్‌ వాలా బాక్సింగ్‌ ఛాంపియన్‌గా ఎదిగిన తీరు నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. దీంతోపా శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి `వీడీ11` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. అలాగే పూరీ జగన్నాథ్‌తో `జనగణమన` చిత్రంలోనూ నటిస్తున్నారు విజయ్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే