యాంకర్‌ సుమకి తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్‌

Published : May 07, 2022, 09:27 PM ISTUpdated : May 07, 2022, 09:30 PM IST
యాంకర్‌ సుమకి తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్‌

సారాంశం

స్టార్‌ యాంకర్‌ సుమకి పెను ప్రమాదం తప్పింది. ఆమె పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. బండరాళ్లపై జారిపడింది.

స్టార్‌ యాంకర్‌ సుమకి పెను ప్రమాదం తప్పింది. ఆమె పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. బండరాళ్లపై జారిపడింది. ఈ ఘటన `జయమ్మ పంచాయితీ` షూటింగ్‌ టైమ్‌లో చోటు చేసుకుంది. సుమ నటిగా రీఎంట్రీ ఇస్తూ ఇటీవల `జయమ్మ పంచాయితీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంటోంది. పల్లెటూరి వాతావరణంలో సాగే మంచి ఆహ్లాదకరమైన చిత్రంగా ప్రశంసలు దక్కుతున్నాయి. 

అయితే ఈ చిత్ర షూటింగ్‌లో సుమకి ప్రమాదం జరిగింది.  చిత్రీకరణలో భాగంగా ఓ అడవిలో చిన్న నీటి ప్రవాహాలున్నాయి. బండరాళ్లపై నుంచి జారుతూ వాటర్‌ కింద పడుతున్నాయి. అయితే కంటిన్యూగా నీళ్లు వస్తున్న నేపథ్యంలో రాళ్లపై పీచు పేర్కొంది. షూటింగ్‌ కోసం సుమ ఆ రాళ్లపైకి ఎక్కింది. వాటిపై నుంచి నడుస్తున్న క్రమంలో ఆమె కాలు జారి కిందపడిపోయింది. దీంతో వెంటనే తేరుకుని తనని తాను కంట్రోల్‌ చేసుకుని లేచి బయటకు వచ్చేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. 

తాజాగా ఈ వీడియోని సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. `తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాన`ని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు స్పందిస్తూ, సుమకి సానుభూతి ప్రకటిస్తున్నారు. `జాగ్రత్త సుమక్క.. మీకేమైనా అయితే మీకు మాత్రమే కాదు, ప్రీరిలీజ్‌ ఈవెంట్స్‌, ప్రొడక్షన్స్‌ టీమ్స్‌కి.. టీఆర్‌పీలకు, టోటల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌కే ఇబ్బంది`, `మీ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాం`, `బీ కేర్‌ఫుల్‌ అక్కా`  అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

సుమ ప్రధాన పాత్రలో నటించిన `జయమ్మ పంచాయితీ` చిత్రానికి విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించగా, వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించారు. శ్రీకాకుళం నేపథ్యంలో సాగే గ్రామీణ కథ ఇది. పల్లెటూరిలో జయమ్మ పాత్రలో ఒదిగిపోయింది సుమ. పాత్రకి ప్రాణం పోసింది. ఆడియెన్స్ ని మెప్పించింది. ఆమెలో అద్భుతమైన నటి ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పింది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే