ఎస్వీ రంగారావు లాగా హీరోతో సమానంగా నటించే విలన్..ఇప్పుడు ఎవరున్నారో తెలుసా ?

By tirumala ANFirst Published Sep 28, 2024, 1:30 PM IST
Highlights

సుకుమార్ శిష్యుడిగా, ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. ఉప్పెన చిత్రం దర్శకుడిగా బుచ్చిబాబుకి గుర్తింపు తీసుకురావడమే కాదు.. ప్రశంసలు కురిసేలా చేసింది. 

సుకుమార్ శిష్యుడిగా, ఉప్పెన చిత్రాన్ని తెరకెక్కించిన బుచ్చిబాబు టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిపోయారు. ఉప్పెన చిత్రం దర్శకుడిగా బుచ్చిబాబుకి గుర్తింపు తీసుకురావడమే కాదు.. ప్రశంసలు కురిసేలా చేసింది. అంత కళాత్మకంగా బుచ్చిబాబు ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. 

విలన్ పాత్రలపై బుచ్చిబాబు కామెంట్ 

బుచ్చిబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ పౌరాణిక చిత్రాల్లో విలన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేసి ఎస్వీ రంగారావు. ఈ లెజెండ్రీ నటుడు అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటుగా నటించి మెప్పించారు. ఎంతటి డైలాగ్ అయినా అనర్గళంగా చెప్పగల సామర్థ్యం ఉన్న నటుడు ఎస్వీఆర్. ఇప్పుడైతే ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలకు గుర్తింపు తెచ్చిపెట్టారు. ఇటీవల ఎక్కువగా దర్శకులు విలన్లుగా నార్త్ నటుల్ని ఎంపిక చేసుకుంటున్నారు. 

Latest Videos

విలన్ పాత్రల గురించి బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో కామెంట్స్ చేశారు. బుచ్చిబాబు మాట్లాడుతూ.. ఎంతటి బలమైన విలన్ పాత్ర అయినా హీరోతో సమానంగా ఉండడం కష్టం. ఎందుకంటే ఎప్పటికైనా హీరో హీరోనే. మీరు ఎస్వీ రంగారావు గారి గురించి విన్నారా అని బుచ్చిబాబు.. విజయ్ సేతుపతిని అడిగారు. ఆయన ఎందుకు తెలియదు.. గ్రేట్ యాక్టర్.. తమిళ్ లో కూడా చాలా సినిమాలు చేశారు అని విజయ్ సేతుపతి తెలిపారు. 

విజయ్ సేతుపతిని ఎస్వీ రంగారావుతో పోల్చుతూ 

ఆయన విలన్ పాత్రల్లో కూడా హీరోలతో సమానంగా నటించేవారట. ఆయన గురించి మేము చాలా విన్నాం. కానీ ఈ జనరేషన్ లో ఎస్వీఆర్ లాగా హీరోలతో సమానంగా నటించే నటుడు మీరు మాత్రమే అంటూ బుచ్చిబాబు విజయ్ సేతుపతిపై ప్రశంసలు కురిపించారు. మీరు నటించిన విక్రమ్, జవాన్, మాస్టర్ చిత్రాల్లో ఆ విషయం అర్థం అవుతుంది అని బుచ్చిబాబు తెలిపారు. 

సినిమా నుంచి బయటకి వచ్చాక ఆడియన్స్ కి హీరో పాత్రతో పాటు విలన్ పాత్ర కూడా బాగా గుర్తుకు వస్తే.. అతడు హీరోతో సమానంగా నటించినట్లే అని బుచ్చిబాబు తెలిపారు. విజయ్ సేతుపతి.. బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన చిత్రంలో విలన్ గా నటించారు. ఉప్పెన చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడానికి విజయ్ సేతుపతి పాత్ర కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. విజయ్ సేతుపతి చివరగా నటించిన మహారాజ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముందు నుంచి విజయ్ సేతుపతి విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ రాణిస్తున్నారు. 

రాంచరణ్ తో బుచ్చిబాబు మూవీ 

ఉప్పెన తర్వాత బుచ్చిబాబు బంపర్ ఆఫర్ అందుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో బుచ్చిబాబు భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. విజయనగరం బ్యాక్ డ్రాప్ లో జరిగే విలేజ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ మూవీ విషయంలో బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. టెక్నికల్ టీం ఎంపికలో కూడా బుచ్చిబాబు తన మార్క్ ప్రదర్శిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఏ ఆర్ రెహమాన్ ని ఎంపిక చేశారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రాంచరణ్ ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని విధంగా రగ్గడ్ లుక్ లో కనిపించబోతున్నారు. 

బుచ్చిబాబు రాంచరణ్ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ 

ఆల్రెడీ ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రాంచరణ్ మేకోవర్ రెడీ అయితే షూటింగ్ కి వెళతారు. విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ తో, నేచురల్ ఎమోషన్స్ తో బుచ్చిబాబు ఈ చిత్ర కథ రాసుకున్నారట.  విక్రమ్ తంగలాన్ చిత్రానికి ఏకాంబరం అందించిన కాస్ట్యూమ్స్ విషయంలో ప్రశంసలు దక్కాయి. కాస్ట్యూమ్స్ చాలా సహజ సిద్ధంగా ఉన్నాయని అంతా అభినందించారు. బుచ్చిబాబుకి కూడా ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ తెగ నచ్చేశాయట. దీనితో బుచ్చిబాబు వెంటనే ఏకాంబరం ని ఆర్సీ 16 చిత్రం కోసం ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఏకాంబరం సోషల్ మీడియాలో అధికారికంగా అనౌన్స్ చేశారు.ఈ విధంగా బుచ్చిబాబు కాంప్రమైజ్ కాకుండా తన టీంని రాంచరణ్ మూవీ కోసం ఎంపిక చేసుకుంటున్నారు. 

 

 

click me!