హీరో సూర్యతో శంకర్ రూ.1000 కోట్ల చిత్రం.. మామూలు ప్లాన్ కాదుగా..

By team teluguFirst Published Sep 11, 2022, 3:58 PM IST
Highlights

దిగ్గజ దర్శకుడు శంకర్ ఏం చేసినా సంచలనమే అవుతుంది. బాక్సాఫీస్ వద్ద శంకర్ నెలకొల్పని రికార్డులు లేవు. శంకర్ చిత్రాలు ఎంత భారీ స్థాయిలో ఉన్నా అందులో తప్పకుండా సందేశం ఉంటుంది.

దిగ్గజ దర్శకుడు శంకర్ ఏం చేసినా సంచలనమే అవుతుంది. బాక్సాఫీస్ వద్ద శంకర్ నెలకొల్పని రికార్డులు లేవు. శంకర్ చిత్రాలు ఎంత భారీ స్థాయిలో ఉన్నా అందులో తప్పకుండా సందేశం ఉంటుంది. అదే శంకర్ స్పెషాలిటీ. ప్రస్తుతం శంకర్.. కమల్ హాసన్ తో ఇండియన్ 2, రాంచరణ్ తో మరో చిత్రం చేస్తున్నారు. 

అలాగే హిందీలో అపరిచితుడు రీమేక్ చేయాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత శంకర్ భారీ ప్లాన్ చేసినట్లు సమాచారం. విలక్షణ నటనతో తెలుగు తమిళ భాషల్లో అభిమానులని సొంతం చేసుకున్న హీరో సూర్యతో శంకర్ చిత్రం ఉండబోతోందట. తమిళనాడులోని మధురై ఎంపీ, రచయత అయిన ఎస్ వెంకటేష్ చారిత్రాత్మక నేపథ్యంలో నేర్పలి అనే నవల రచించారు. 

ఈ నవలలోని కథతో 1000 కోట్ల బడ్జెట్ లో శంకర్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్, వెంకటేష్ ఇద్దరూ స్క్రీన్ ప్లే పై వర్క్ చేస్తున్నారట. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో స్క్రిప్ట్ పైనే ఎక్కువ కాలం వర్క్ చేయనున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా రూపుదిద్దుకున్న తర్వాత శంకర్ ఈ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం సూర్య శివ దర్శకత్వంలో 42వ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే బాల దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేస్తున్నారు. సూర్య లాంటి అద్భుతమైన నటుడు శంకర్ సినిమాలో నటిస్తే అది నెక్స్ట్ లెవల్ లో ఉండడం ఖాయం. 

click me!