RIP Krishnam Raju: కృష్ణంరాజు పార్థివదేహానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ నివాళులు! 

By Sambi ReddyFirst Published Sep 11, 2022, 2:00 PM IST
Highlights

కృష్ణంరాజు పార్థివదేహాన్ని ప్రముఖులు సందర్శిస్తున్నారు. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు.

ప్రముఖుల సందర్శనార్ధం కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఆయన నివాసం వద్ద ఉంచారు. చిత్ర ప్రముఖులు, సన్నిహితులు ఆయన దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కృష్ణంరాజు మృతదేహాన్ని సందర్శించారు. పూలతో ఆయనకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు.మహేష్ సోషల్ మీడియా వేదికగా కృష్ణంరాజు మృతిపై విచారం వ్యక్తం చేశారు. అలాగే స్వయంగా నివాసానికి వెళ్లి సీనియర్ నటుడికి నివాళులు సమర్పించారు. 

అక్కడే ఉన్న ప్రభాస్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మహేష్ తండ్రిగారైన కృష్ణ కృష్ణంరాజుకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు. 50 ఏళ్లుగా వాళ్ళ మధ్య స్నేహం ఉంది. దాదాపు ఒకే సమయంలో కెరీర్ ప్రారంభించారు. తేనె మనసులు చిత్రానికి ఇద్దరూ ఆడిషన్స్ కి వెళ్లినట్లు కృష్ణ వీడియో బైట్ లో తెలియజేశారు. కృష్ణంరాజు మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కృష్ణంరాజు గారి పార్థివదేహానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ నివాళులు! pic.twitter.com/l7qnrG1pRL

— Asianetnews Telugu (@AsianetNewsTL)

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ సెప్టెంబర్ 11 తెల్లవారుజామున కృష్ణంరాజు కన్నుమూశారు. కృష్ణంరాజు మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటింది. 

1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు 1966లో విడుదలైన చిలకా గోరింకా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కెరీర్ లో 180కి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. రెబల్ స్టార్ గా కృష్ణంరాజు మాస్ ఇమేజ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  బీజేపీ గవర్నమెంట్ లో ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నెరవేర్చావు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో పలు కీలక పదవులు అలంకరించారు. 
 
 

click me!