ఈ సినిమాపై ఒక్క టాలీవుడ్ కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా తో సహా రకరకాల కారణాలతో ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.
రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆర్.ఆర్.ఆర్. తెలుగులో స్టార్స్ గా వెలుగుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు ఫ్లాఫ్ అంటూ ఎరగని రాజమౌళి డైరక్టర్ కావటం, అదీ బాహుబలిలాంటి భాక్సాఫీస్ హిట్ తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం వంటివి ఈ సినిమాకు ఎక్కడలేని హైప్ తెచ్చాయి. దాంతో ఈ సినిమాపై ఒక్క టాలీవుడ్ కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా తో సహా రకరకాల కారణాలతో ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.
Also read చిరు శత్రువులు అల్లు అరవింద్ కి మిత్రులు అయ్యారు
మొత్తానికి ఈ సినిమాను సంక్రాంతికి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాకు ఓపినింగ్స్,కలెక్షన్స్ ఓ రేంజిలో ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. దాంతో బిజినెస్ కూడా అదే రీతిలో జరగనుంది. అయితే సినిమా ఆంద్రప్రదేశ్ లో టిక్కెట్లు కు సంభందించిన ఇష్యూలు ఇంకా సెట్ కాకపోవటంతో బిజినెస్ మాత్రం చెప్పిన రేట్లకు అవటం లేదంటున్నారు. అంతకు ముందే బిజినెస్ పూర్తి చేసుకున్న వారు సైతం ఈ రీజన్ చూపించి ముప్పై శాతం దాకా రేటు తగ్గించని అడిగి ఒప్పించుకున్నారనే వార్త ఇండస్ట్రీలో తిరుగుతోంది. దాంతో చాలా పెద్ద మొత్తమే నిర్మాతకు రిలీజ్ కు ముందే లాస్ అంటున్నారు.
Also read నామినేషన్స్ కి భయపడేంత సీన్ లేదు..శ్రీరామ్ మాస్, షణ్ముఖ్ తల్లి గురించి సంచలన నిజం
ఇక ప్రమోషన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. అయితే ఇవి విడుదలై చాలా రోజులవుతోన్నా ఇప్పటి వరకు మరో అప్‌డేట్ మాత్రం రాలేదు. దీంతో అభిమానులు సినిమా టీజర్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర టీజర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా టీజర్‌ను అక్టోబర్ 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ గా ప్రకటన రావాల్సిందే.