ఉస్తాద్ రామ్ పోతినేని - బోయపాటి కాంబోలో వస్తున్న ‘బోయపాటిరాపో’ చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయ్యింది. తాజాగా టైటిల్ తో పాటు పవర్ ఫుల్ గ్లింప్స్ ను కూడా అధికారికంగా ప్రకటించారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో పవర్ ఫుల్ యాక్షన్ తో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. చిత్రం నుంచి వరుసగా అప్డేట్స్ అందిస్తున్నారు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడా అని చూసేలా ఆసక్తి పెంచుతున్నారు. అయితే మొన్నటి వరకు ఈ చిత్రాన్ని Boyapati Rapo వర్క్ టైటిల్ తో షూట్ చేశారు. ఇక తాజాగా సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసి కొద్దిసేపటి కింద అనౌన్స్ చేశారు.
బోయపాటి - రామ్ పోతినేని చిత్రానికి ‘స్కంద’ (Skanda) అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ‘ది ఎటాకర్’ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. మొత్తానికి టైటిల్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తోంది. బోయపాటి సినిమాలన్నీంటికి ఈ తరహాలో టైటిల్స్ ఉండటం మరింత కిక్కునిస్తుంది. టైటిల్ ను అనౌన్స్ చేస్తూ మాస్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. సినిమాపై మరింతగా అంచనాలను పెంచేలా ఉంది. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
‘స్కంద’ టైటిల్ గ్లింప్స్ విషయానికొస్తే.. రామ్ పోతినేని చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. మాస్ గ్లింప్స్ లో రామ్ చెప్పిన ‘మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు’ డైలాగ్ చాలా మాస్ గా ఉండటంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. రామ్ మాస్ అవతార్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు.
చివరిగా బోయపాటి ‘అఖండ’తో భారీ బ్లాక్ బాస్టర్ అందించిన విషయం తెలిసిందే. ఇక ‘స్కంద’ కూడా పక్కా హిట్ అనేలా హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ థండర్ కు మాసీవ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. చిత్రంలో యంగ్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) రామ్ పోతినేని సరసన నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ఐదు ఇండియన్ లాంగ్వేజేస్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
is now S-K-A-N-D-A🔥
Title Glimpse
స్కంద: https://t.co/QjKRFT1nMC
स्कंदा: https://t.co/m7LjWLXsel
ஸ்கந்தா: https://t.co/nIo7zv6qct
ಸ್ಕಂದ: https://t.co/6SiZQC6zR7
സ്കന്ദ: https://t.co/gcw1sDh2jr pic.twitter.com/uHYVFSwpym