పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే చాలు.. 100 సినిమాలైనా తీస్తాను.. తమిళ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

Published : Jun 12, 2023, 01:07 PM IST
పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే చాలు.. 100 సినిమాలైనా తీస్తాను.. తమిళ స్టార్ డైరెక్టర్ కామెంట్స్..

సారాంశం

నటుడిగా దర్శకుడిగా తెలుగు తమిళ భాషల్లో దూసుకుపోతున్నాడుసముద్ర ఖని. పవన్ కల్యాణ్ తో బ్రోమూవీ చేస్తున్న ఆయన తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.


బుల్లితెరపై  ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత వెండితెర నటుడిగా, దర్శకుడిగా తెలుగు,తమిళం భాషల్లో  తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్ర ఖని. ఈ మధ్య తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ.. టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్నారు. ఇక  ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో  బ్రో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళంలో వినోదయ సిత్తా సినిమాకు  ఈ సినిమా  రీమేక్ గా తెరకెక్కింది. తమిళంలో తానే డైరెక్ట్ చేసిన సినిమాను తెలుగులో కూడా సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నాడు. 

సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుని... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందీ మూవీ. జూలై 28న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. దానికితోడు ఇటవలే రిలీజైన ఫస్ట లుక్ పోస్టర్ కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది.ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను సముద్ర ఖని వెల్లడించారు. త్వరలోనే టీజర్ ను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు  ఆయన తెలిపారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. 

పవన్ కల్యాణ్ తో రెండో సినిమా చేస్తారా అని యాంకర్ అడగ్గా.. వంద సినిమాలు చేయడానికైనా రెడీగా ఉన్నా.. నా దగ్గర చాలా కథలున్నాయి. పవన్ కల్యాణ్ నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. సినిమా చేసేందుకు నేను రెడీగా ఉంటా అని ఆయన అన్నారు ప్రస్తుతం సముద్రఖని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 

ఇక బ్రో సినిమా గురించి మాట్లాడుతూ.. టీజర్ కట్ కు సంబంధించిన పనులు స్టార్ట్ చేసినట్లు వెల్లడించాడు. అంతేకాకుండా ఫస్ట్ ఆఫ్ కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని, సెకండ్ ఆఫ్ డబ్బింగ్ పనులు త్వరలోనే స్టార్ట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఇక ఈ సినిమా కు  త్రివిక్రమ్‌ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేయగా..  థమన్‌ సంగీతం అందించారు.  ఈ సినిమాను పీపుల్‌ మీడియా సంస్థ నిర్మిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?
2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?