మరొక్కసారి ఆహా అనిపించబోతున్న అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్..

Published : Jun 12, 2023, 12:29 PM IST
మరొక్కసారి ఆహా అనిపించబోతున్న అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్..

సారాంశం

ముచ్చటగా మూడు సార్లు హిట్లు కొట్టిన హ్యాట్రిక్ కాంబినేషన్ నాలుగోసారి  సందడి చేయబోతుంది. అయితే ఈసారి మాత్రం వెండితెరపై కాకుండా.. బుల్లితెరపై రచ్చచేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్, త్రివిక్రమ్.

అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ది సూపర్ హిట్ కాంబినేషన్.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. . జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఇలా ఈమూడు సినిమాలు గ్యాప్ తీసుకుని చేసినా.. సూపర్ హిట్ సినిమాలైతే చేశారు. హ్యాట్రిక్ ఒక విశేషం అయితేు.. బ్లాక్ బస్టర్ హ్యాట్రిక్ మరో విశేషం. ఈ ఇద్దరి కాంబోలో ఇంకో మూవీ ఉండబోతుందని గతంలోనే ప్రకటించారు. అయితే దానికంటే ముందే ఈ ఇద్దరి కాంబోలో ఇంకేదో సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్ ఇంతకీ అదేంటంటే..? 

 తెలుగులో దూసుకుపోతున్న ఆహా ఓటీటీ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. తాజగా అల్లు అర్జున్ తో ఆహా కొత్తగా ఏదో ప్లాన్ చేయబోతుంది.తాజాగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ అంటూ షూటింగ్ స్పాట్ లో వారిద్దరూ ఉన్న ఓ ఫోటోని రిలీజ్ చేసింది ఆహా టీం. ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండబోతుందని ప్రకటించింది. 

దీంతో  అసలు బన్నీతో..ఆహా ఏం చేయబోతుంది. అది కూడా త్రివిక్రమ్ డైరెక్షన్ లో పెద్దగా ఏం ప్లాన్ చేసి ఉంటారబ్బా అని చెపువులుకొరుక్కుంటున్నారు ఫ్యాన్స్.  ఏదైనా షో ప్లాన్ చేస్తున్నారా? లేకా ఆహా కోసం యాడ్ చేస్తున్నారా? లేదా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నారా అని అభిమానులు,  లేకపోతే ఏకంగా వెబ్ సిరీస్ చేస్తున్నారా..? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో అల్లు అర్జున్ కాని.. ఆహా కాని క్లారిటీ ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. 

అయితే ఈ ప్రాజెక్టు ని #AAtakesoverAha అని ప్రమోట్ చేస్తున్నారు టీమ్. విషయం మాత్రం చెప్పడంలేదు.  ఆహా రిలీజ్ చేసిన ఫోటో చూస్తుంటే  మాత్రం గతంలో త్రివిక్రమ్, అల్లు అర్జున్, శ్రీలీలకు సంబంధించిన ఫోటో కూడా ఇదే షూట్ నుంచి వచ్చిందని తెలుస్తోంది.  అది యాడ్ ఫిల్మ్ అని... అంతా అనుకున్నారు. కాస్ట్యూమ్స్ ను బట్టి ఇది యాడ్ ఫిల్మ్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నారంతా..?  మరి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?
2026 Upcoming Top Movies : ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోలు ఎవరు?