టాంజానియా కపుల్స్ నోట ప్రభాస్ ఆదిపురుష్ పాట.. స్పందించిన సింగర్..

Published : Jun 12, 2023, 11:34 AM IST
టాంజానియా కపుల్స్ నోట ప్రభాస్ ఆదిపురుష్ పాట.. స్పందించిన సింగర్..

సారాంశం

బాహుమలి, ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన తరువాత ప్రపంచాన్ని ఆకర్శిస్తే.. రిలీజ్ కాకముందే ప్రపంచ వ్యాప్తంగా బజ్ ను క్రియేట్ చేస్తోంది ఆదిపురుష్ మూవీ.   


బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో.. గ్లోబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణబ్రహ్మగా నటించిన ఈ పాన్ వరల్డ్ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతీ ఒక్క అప్ డేట్ ప్రపంచాన్ని ఆకర్శిస్తున్నాయి.  ఈక్రమంలో వల్డ్ ఫేమస్ య్యూట్యూబర్స్.. రీల్స్ స్పెషలిస్ట్ లు.. ఆదిపురుష్ నుంచి థిమ్ ను తీసకుని వీడియోలు చేస్తున్నారు. ఈక్రమంలోనే టాంజానియాకు చెందిన ఫేమస్ కంటెంట్ క్రియేటింగ్ కపుల్స్  కిలీపాల్ మరియు అతని సోదరి నీమా ఇద్దరు ఆదిపురుష్ రీల్ చేసి ఆకట్టుకున్నారు. 

టాంజానియా కంటెంట్ సృష్టికర్త కిలీ పాల్ మరియు అతని సోదరి నీమా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను చేయడంలో ప్రపంచ  ప్రసిద్ధి చెందారు, అక్కడ వారు హిందీ సినిమా పాటలకు లిప్ సింక్ చేస్తూ.. డాన్స్ చేస్తూ.. వీడియోలు చేయడం అందిరిని ఆకర్షించింది. ఈ వీడియోలతో వారు కోట్ల మంది అభిమానులను సంపాధించారు.  హిందీలో ఫేమస్ సాంగ్స్ లో వేటిని వదిలిపెట్టకుండా వీడియోలు చేసిన ఈ జంట.. తాజాగా రిలీజ్ కు రెడీగా ఉన్న  ఆదిపురుష్' నుండి ఒక ప్రముఖ పాటకు లిప్ సింక్ చేస్తూ.. వీడియో చేశారు. 

 

ఈసారి, ఇద్దరూ 'రామ్ సియా రామ్' పాడటానికి ఎంచుకున్నారు.. పాటను అద్భుంగా వీడియో చేశారు. అందరూ ఈ వీడియోను చూడాలి అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. చాలా రోజుల క్రితం కిలీపాల్ ఈ వీడయోను చేసి అప్ లోడ్ చేయగా..  ఈ సాంగ్ చాలా తక్కువ టైమ్ లోనే 70 లక్షలకు పైగా ఫ్యూస్ ను సాధించడం గమనార్హం. ఇక ఈ వీడియోపై.. ఈ పాటను గానం చేసినటువంటి గాయకుడు సుచేత్ టాండన్ స్పందించారు. ఈ విధంగా సోషల్ మీడియాలో రాసుకోచర్చారు. వావ్ అంటూ పొగిడిన మ్యూజిక్ డైరెక్టర్ హార్ట్ సింబల్ ను అందించాడు. 

ఇక ఈ వీడియోకు భారీగా స్పందన వస్తోంది. లక్షల్లో కామెంట్లు కూడా వస్తున్నాయి. చాలా మంది హార్ట్ ఎమోమోజీలను జత చేయగా.. కొంత మంది మాతరం ఫైర్ ఎమ్మోజీలు పోస్ట్ చేస్తున్నారు. ఇంకొంత మంది మాత్రం అద్భుతం అంటూ కామెంట్ చేస్తునారు. మరికొంత మంది  మా హృదయాలు దోచుకున్నారు అంటూ కామెంట్స్ చేయగా.. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఇండియా జై శ్రీ రామ్" అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇలా ఈ వీడియోకు రకరకాల కామెంట్లు వినిపించాయి.. కనిపించాయి. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్