
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. ఇది ఏపీ సీఎం వై ఎస్ జగన్ బయోపిక్. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన పొలిటికల్ సిట్యుయేషన్ వై ఎస్ జగన్ కోణంలో చూపించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా వై ఎస్ జగన్ ఓదార్పు యాత్ర, ఆపై సీబీఐ కేసులు, జైలు జీవితం, పాదయాత్ర, సీఎం పీఠం అధిరోహించడం వరకూ ఈ చిత్రం ఉంటుందని సమాచారం.
అనూహ్యంగా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ప్రస్తావన కూడా వ్యూహంలో ఉన్నట్లు లేటెస్ట్ స్టిల్స్ చూస్తే అర్థం అవుతుంది. నిన్న అల్లు అరవింద్ తో చిరంజీవి మాట్లాడుతుంటే కొంచెం దూరంగా కూర్చుని పవన్ కళ్యాణ్ గమనిస్తున్నట్లు ఒక స్టిల్ వదిలాడు. నేడు చిరంజీవి ఏదో చెబుతుంటే పవన్ కళ్యాణ్ వినకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు అన్నట్లుగా ఉన్న స్టిల్ షేర్ చేశాడు.
మొత్తంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లతో పాటు చిరంజీవిని కూడా రామ్ గోపాల్ వర్మ టార్గెట్ చేశాడనిపిస్తుంది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం చిరంజీవి పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. దీనికి సంబంధించి చిరంజీవి, పవన్ మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలను వ్యూహం మూవీలో చూపించే ప్రయత్నం జరగొచ్చు. చిరంజీవి కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడాన్ని పవన్ వ్యతిరేకించాడు. ఓపెన్ గా అన్న చిరంజీవి మీద ఆరోపణలు చేశాడు. తమ్ముడు పవన్ ఆరోపణలు చిరంజీవి లైట్ తీసుకున్నాడు. పవన్ ది చిన్న పిల్లాడు మనస్తత్వం . ఆవేశం ఎక్కువ, అంటూ చిరంజీవి కొట్టిపారేశారు.
ఇక వ్యూహం మూవీ చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. సమీప కాలంలో విడుదల చేసే అవకాశం కలదు. వ్యూహం టీజర్ ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు రేపింది. మరి పూర్తి స్థాయి చిత్రం ఎంత రచ్చ చేయనుందో చూడాలి.