ఏపీలో గెలుపు ఎవరిదో తేల్చేసిన డైరెక్టర్ వర్మ... షాకింగ్ సర్వే, 100 శాతం కరెక్ట్!

Published : Jun 02, 2024, 04:43 PM IST
ఏపీలో గెలుపు ఎవరిదో తేల్చేసిన డైరెక్టర్ వర్మ... షాకింగ్ సర్వే, 100 శాతం కరెక్ట్!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో విజయం సాధించేది ఎవరనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అత్యంత పోటీ నెలకొంది. ఈ క్రమంలో గెలిచేది ఎవరో తేల్చేశాడు వర్మ. 100 శాతం ఖచ్చితత్వం తో కూడిన సర్వే విడుదల చేశాడు.   

అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకెత్తు ఏపీలో ఎన్నికలు మరొక ఎత్తు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బలమైన నాయకుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఢీకొట్టేందుకు మూడు పార్టీలు కూటమిగా వస్తున్నాయి. బీజేపీ+టీడీపీ +జనసేన కూటమిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీతో పోటీపడుతున్నాయి. ఈసారి అధికారం ఎవరిదనే ఉత్కంఠ నెలకొంది. ఎవరికీ అంత ఈజీ కాదనేది సుస్పష్టం. జూన్ 1న విడుదల చేసిన ఎగ్జిట్ ఫలితాలు సైతం ఇదే తెలియజేశాడు. 

కొన్ని సంస్థలు వైసీపీదే అధికారం అని వెల్లడించగా మరొకొన్ని సంస్థలు ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ క్రమంలో జూన్ 4న ఎలాంటి ఫలితాలు రానున్నాయనే టెన్షన్ కొనసాగుతుంది. ఇదిలా ఉండగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో విజయం ఎవరిదో తేల్చేశారు. 100 శాతం ఖచ్చితత్వం తో కూడిన సర్వే విడుదల చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. 

రచయిత సిరాశ్రీ తన ఎగ్జిట్ పోల్ సర్వే పంచుకున్నాడు. ఏపీ అసెంబ్లీ...  వైసీపీ 0-175, అలయెన్స్ 0-175, పార్లమెంట్ వైసీపీ 0-25, అలయెన్స్ 0-25 అని ట్వీట్ చేశాడు. సిరాశ్రీ ట్వీట్ ని కోట్ చేసిన రామ్ గోపాల్ వర్మ. వంద శాతం నమ్మదగిన సర్వే అంటూ కామెంట్ చేశాడు. గెలిచేది ఎవరైనా సిరాశ్రీ చెప్పినట్లే ఫలితాలు ఉంటాయి. ఈ సెటైరికల్ ట్వీట్ ని వర్మ రీ ట్వీట్ చేశాడు. 

కాగా వైఎస్ జగన్ కి వర్మ అభిమాని. ఆయన బయోపిక్ సైతం తెరకెక్కించాడు. అదే సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లను వర్మ ఓ రేంజ్ లో విమర్శిస్తూ ఉంటారు. వారిని ఉద్దేశిస్తూ సెటైరికల్ గా సినిమాలు కూడా చేశాడు. వర్మను టీడీపీ, జనసేన శ్రేణులు విమర్శిస్తూ ఉంటాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్