
అల్లరి నరేష్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రొటీన్ స్పూఫ్ కామెడీ కథలు కాకుండా విభిన్న తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సినిమాల్లో తన నటనతో దుమ్ము రేపుతున్నాడు .సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయోగాల బాట పడుతూ ఈ హీరో నటించిన 'నాంది', 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం', 'ఉగ్రం' వంటి సినిమాలు చేసాడు. నాంది సూపర్ హిట్ కాగా... మిగలివి యావరేజ్, బిలో యావరేజ్ అనిపించుకున్నాయి. సర్లే అని మళ్లీ ఓ సారి కామెడీ వైపు చూస్తూ ఆ ఒక్కటీ అడక్కు సినిమా చేస్తే ఆ సినిమా అసలు వర్కవునట్ కాలేదు. దాంతో మళ్లీ తన సీరియస్ సినిమాల బాట పట్టారు.
అల్లరి నరేష్ కెరీర్లో 62వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బచ్చలమల్లి' అనే టైటిల్ ఫిక్స్ చేసి ఎనౌన్స్ చేసారు. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. దాంతో సినిమా బిజినెస్ కూడా అదిరిపోయే స్దాయిలో జరిగిందని వినికిడి. ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడటంతో ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ 9 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
అలాగే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మాత్రం 5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం .ఈ మధ్య కాలంలో విడుదలైన అల్లరి నరేష్ సినిమాలలో ఈ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న సినిమా ఇదే కావటం తో ట్రేడ్ షాక్ అవుతోంది. వాస్తవానికి ఇటీవల వచ్చిన నరేష్ సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku) రూ.5 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేదు. అయితే ఆ రూ.5 కోట్లలో కొంత రిఫండబుల్ అడ్వాన్స్ ఉందట.
సరే ఇంతకీ 'బచ్చలమల్లి' అనే టైటిల్ లో ఉన్న వ్యక్తి పేరు ఎవరిది? ఈ ప్రాజెక్టుకి ఆ టైటిల్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయానికొస్తే.. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని తునిలో గజదొంగగా పేరుగాంచిన బచ్చలపల్లి జీవిత కథనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు.. 1990 కాలంనాటి భావోద్వేగ ప్రయాణంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఉద్వేగవంతమైన పాత్రలో అల్లరినరేశ్ కనిపించనున్నారు. సుబ్బు మంగదేవి దర్శకుడు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రోహిణి, రావు రమేశ్, అచ్యుత్‌కుమార్, బలగం జయరామ్, హరితేజ, వైవా హర్ష, ప్రవీణ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథనం: విప్పర్తి మధు, కెమెరా: రిచర్డ్ ఎం.నాథన్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్.