
దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికలు, ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. దీనితో ఆ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. పిఠాపురం ఎన్నికల రిజల్ట్ పై ఎవరి అంచనాలు వాళ్ళకి ఉన్నాయి. జనసేన పార్టీ అభిమానులు అయితే పవన్ ఇక్కడి నుంచి భారీ మెజారితో విజయం సాధిస్తారని ఆశిస్తున్నారు.
ఎన్నికల రిజల్ట్ వచ్చిన మరోసారి రోజే అంటే జూన్ 5న పిఠాపురంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది. శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన మనమే చిత్రం జూన్ 7న రిలీజ్ కి రెడీ అవుతోంది. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 5న పిఠాపురంలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.
దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. పిఠాపురం కి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకునేలా సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరోసారి రోజే పిఠాపురంలో మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారట.
ఒక వేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తే.. మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాంచరణ్ కి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఫ్యాన్స్ అంతా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.