ముచ్చటగా మూడోసారి ఆ నిర్మాతతో సెట్ చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటి 

Published : Feb 29, 2024, 08:10 PM IST
ముచ్చటగా మూడోసారి ఆ నిర్మాతతో సెట్ చేసిన మోహన కృష్ణ ఇంద్రగంటి 

సారాంశం

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. నేడు ఈ మేరకు ప్రకటన చేశారు. మరో మంచి చిత్రం వస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.   

శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రేక్షకులకు మంచి మంచి చిత్రాలు అందించి తన అభిరుచి చాటుకున్నారు ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.‌ అగ్ర కథానాయిక సమంత 'యశోద'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు.‌ లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800'కి సమర్పకులుగా వ్యవహరించారు. ఇప్పుడు ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కొత్త సినిమా ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్ కలయికలో తొలి సినిమా నాని 'జెంటిల్ మన్'. బాక్సాఫీస్ విజయంతో పాటు విమర్శకుల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత సుధీర్ బాబు, అదితీ‌ రావు హైదరీ జంటగా సూపర్ హిట్ సినిమా 'సమ్మోహనం' చేశారు. ఇప్పుడు చేయబోయేది వాళ్ళిద్దరి కలయికలో ముచ్చటగా మూడో సినిమా. ఇందులో ప్రియదర్శి కథానాయకుడిగా నటించనున్నారు. హీరోగా 'బలగం' సినిమాతో ఆయన భారీ విజయం అందుకున్నారు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలు కానుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMDb రిపోర్ట్ ప్రకారం 2025 లో టాప్ 10 పాపులర్ సినిమాలు ఏవంటే?
Akhanda 2 Premiers: అఖండ 2 చిత్రానికి మరో కోలుకోలేని దెబ్బ.. ప్రీమియర్ షోల అనుమతి రద్దు చేసిన హైకోర్టు