మోదీపై ఘాటు వాఖ్యలు చేసిన కొరటాల, మోహన్ బాబు

First Published Mar 8, 2018, 3:32 PM IST
Highlights
  • వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండే శివ సాక్షాత్తూ భారత ప్రధానిని నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు
  • సినీ నటుడు మోహన్ బాబు సైతం కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు​

తన సినిమాల ద్వారా సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడమేకాదు.. ఆ సినిమాల్ని బ్లాక్ బస్టర్స్ గా నిలబెట్టడం కూడా దర్శకుడు కొరటాల శివకున్న దమ్ము. తన గత సినిమాలు మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లలో శివ ఎలాంటి మెసేజ్ ఇచ్చారో… దాన్ని ఆడియన్స్ ఎలా తీసుకున్నారో కూడా అందరికీ తెలిసిందే. తాజాగా మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమా తెరకెక్కిస్తోన్న కొరటాల శివ ఒక సంచలన ప్రకటన చేశారు.

 

Wen natural disasters occur,we all bcome 1 nd react.I felt a similar disaster occurred 2 d state.Keeping politics nd political parties strictly aside,I as a responsible citizen expressed my agony without any hesitation nd calculation.And I’ll keep on doing it. No politics plsssss

— koratala siva (@sivakoratala)

Let’s all make ji a MAN by reminding his promise to Andhra Pradesh. Do u honestly feel that telugu states are a part of India sir?

— koratala siva (@sivakoratala)

 

 

వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండే శివ సాక్షాత్తూ భారత ప్రధానిని నరేంద్రమోదీనే టార్గెట్ చేశారు.‘ఆంధ్రప్రదేశ్‌కు గతంలో ఇచ్చిన హామీలను మనమంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి గుర్తుచేసి.. ఆయనను మనిషిగా మారుద్దాం.. తెలుగు రాష్ట్రాలు భారత్‌లో అంతర్భాగం అని మీరు నిజాయితీగా భావిస్తున్నారా సార్..?’ అంటూ సరాసరి మోదీని ప్రశ్నించారు కొరటాల శివ. ఇటీవల రిలీజ్ అయిన తన ‘భరత్ అనే నేను’ టీజర్‌లో సీఎం పాత్రలో మహేష్ చెప్పిన డైలాగ్స్‌ను ప్రధానికి అన్వయిస్తూ తన ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో శివ పోస్ట్ పెట్టారు.

 

Why this step motherly treatment to Andhra Pradesh? What did A.P do wrong? What’s going on with Special Status? Even when Telangana is supporting Special Status for A.P, is it just the sentiment of one state?

— Mohan Babu M (@themohanbabu)

 

అటు ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు సైతం కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబట్టారు. ఏపీ మీద సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ విమర్శించారు. ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణే  సపోర్ట్ చేస్తుంటే మీకేమైదంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు.

click me!