కోడి రామకృష్ణ చివరి మాటలు!

By Udaya DFirst Published Feb 22, 2019, 3:56 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. 

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించారు. ఇటీవల ఆయన చివరిగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

ఆయన కెరీర్ లో 120 సినిమాలు చేయడం ఓ కలలా ఉందని అన్నారు. ఆయన మాటల్లోనే.. ''రాత్రి పడుకున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే.. ఇదంతా కలేమో పొద్దున్న లేచి మళ్లీ పాలకొల్లు స్టూడెంట్ లా లేస్తానేమో అనిపిస్తుంది. అలాంటి చక్కని కెరీర్ నాడు. అంతా కలలా సాగింది. నేను ఈ రేంజ్ కి ఎదిగానంటే కారణం నాతో పాటు పని చేసిన హీరోలు, నిర్మాతల సహకారం''అంటూ తన హీరోలు, నిర్మాతల గొప్పదనాన్ని గుర్తు చేసుకున్నారు. 

తన కథలను ప్రేరణ అంటూ ఏమీలేదని.. కొమ్మా కొమ్మా రాసుకుంటే నిప్పు ఎలా పుడుతుందో.. తన నుండి కథలు కూడా అలానే పుట్టుకొస్తాయని అన్నారు. నువ్వు ఎప్పుడు నేర్చుకోవడం మానేస్తామో.. అప్పుడే నీ గొప్పదనం పోతుందనే మాటలు తాను గట్టిగా నమ్ముతానని ఆయన చెప్పిన మాటలు ఎంతో మంది కొత్త దర్శకులకు మార్గదర్శకాలు.   
 

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత! 

click me!