కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

By Udaya DFirst Published 22, Feb 2019, 3:40 PM IST
Highlights

ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సేవలు మరువలేనివి. దాదాపు 150 చిత్రాలను డైరెక్ట్ చేసిన ఘనత ఆయన సొంతం. 

ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. సినిమా ఇండస్ట్రీలో ఆయన సేవలు మరువలేనివి. దాదాపు 150 చిత్రాలను డైరెక్ట్ చేసిన ఘనత ఆయన సొంతం. ఎందఱో టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన ఆయనకి ఓ విచిత్రమైన అలవాటు ఉంది.

అదేంటంటే.. ఆయన తన నుదిటి చుట్టూ గుడ్డ కట్టుకొని షూటింగ్ స్పాట్ లో కనిపిస్తాడు. రాత్రిపూట కూడా ఆయన అలానే గుడ్డ కట్టుకొనే ఉంటారు. దానికి గల కారణాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో వివరించారు. కోడిరామకృష్ణ గతంలో 'మాపల్లెలో గోపాలుడు' అనే సినిమాను డైరెక్ట్ చేశారు.

ఆ సమయంలో ఆయన దగ్గర కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన మోకా రామారావు అనే వ్యక్తి రామకృష్ణ దగ్గరకు వచ్చి మీ నుదిటి భాగం చాలా పెద్దది కాబట్టి అది ఎండలో తెగ మాడిపోతుందని చెప్పి తన జేబులో రుమాలుని కోడి రామకృష్ణ నుదిటి చుట్టూ గుడ్డ కట్టాడట. అది కోడి రామకృష్ణ ముఖానికి బాగానప్పడంతో ఆయన నుదిటి కొలతల ప్రకారం ఓ బ్యాండ్ చేయించిన మోకా రామారావు అది కోడి రామకృష్ణకి బహుమతిగా ఇచ్చారట.

అయితే అనుకోకుండా ఆ గెటప్ లో కోడి రామకృష్ణని దర్శకుడు కె.బాలచందర్ చూసి.. ఈ అవతారం ఈ జన్మది కాదూ క్రితం జన్మ తాలూకు వాసనది అని భావయుక్తంగా చెప్పడంతో అలానే కంటిన్యూ చేశారట కోడి రామకృష్ణ. షూటింగ్ సమయంలో తన తలకు ఆ బ్యాండ్ లేకుండా అసలు ఉండలేరట.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత! 

Last Updated 22, Feb 2019, 3:42 PM IST