మొదటిసారి కెమెరా ముందుకు దర్శకేంద్రుడు... పవన్ షాకింగ్ రియాక్షన్

Published : Jul 30, 2021, 01:55 PM IST
మొదటిసారి కెమెరా ముందుకు దర్శకేంద్రుడు... పవన్ షాకింగ్ రియాక్షన్

సారాంశం

రాఘవేంద్ర రావు నటుడిగా మారడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు పవన్ కళ్యాణ్. దర్శకుడిగా మరపురాని విజయాలు అందించిన రాఘవేంద్రరావు నటుడిగా కూడా సక్సెస్ కావాలని కోరుకున్నారు. 


వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి రికార్డు నెలకొల్పిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మొదటిసారి కెమెరా ముందుకు వస్తున్నారు. పెళ్ళిసందడి చిత్రంలో ఆయన ఓ కీలక రోల్ చేస్తున్నారు. పెళ్లి సందడి మూవీలో రాఘవేంద్ర రావు లుక్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయడం జరిగింది. గ్లాసెస్, సూటు, బూటు ధరించి సూపర్ క్లాస్ గా ఆయన లుక్ ఉంది. 


తాజా అప్డేట్ తో పెళ్లి సందడి చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ దిగ్గజ దర్శకుడు నటుడిగా వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని, ఆయన అభిమానులు, మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. రాఘవేంద్ర రావు ఫస్ట్ లుక్ ప్రోమోని దర్శకధీరుడు రాజమౌళి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. రాజమౌళి సైతం నటుడిగా మారిన రాఘవేంద్ర రావు పై ప్రశంసల వర్షం కురిపించారు. 


కాగా రాఘవేంద్ర రావు నటుడిగా మారడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు పవన్ కళ్యాణ్. దర్శకుడిగా మరపురాని విజయాలు అందించిన రాఘవేంద్రరావు నటుడిగా కూడా సక్సెస్ కావాలని కోరుకున్నారు. నటనలో ఆయన అనుభవం ఖచ్చితంగా కనిపిస్తుందని తెలియజేశారు. అలాగే అనేక మంది దర్శకులు రాఘవేంద్రరావును తమ చిత్రాలలో నటింప చేయాలని కోరుకుంటారని అన్నారు. 


ఇక శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పెళ్లి సందడి చిత్రం తెరకెక్కుతుంది. గౌరీ రోనంకి దర్శకత్వంలో పెళ్లి సందడి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా 1996లో విడుదలైన పెళ్లి సందడి భారీ విజయం నమోదు చేసింది. శ్రీకాంత్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా పెళ్లి సందడి చిత్రం ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Anchor Anushree: రెండేళ్లు సీక్రెట్ డేటింగ్, జ్యూస్‌లో ఏమైనా కలిపారేమోనని భయపడ్డా.. లవ్‌ స్టోరీ బయటపెట్టిన అనుశ్రీ
Dhurandhar 2 Collections: `పుష్ప 2` ని కొడుతుందనుకుంటే డీలా పడ్డ `ధురంధర్‌ 2`.. టోటల్‌ కలెక్షన్లు ఇవే