చిన్న సినిమాల మనుగడ దానితోనే సాధ్యం... సీఎం జగన్ కి శాల్యూట్

By team teluguFirst Published Jul 30, 2021, 12:00 PM IST
Highlights

ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమా వకీల్ సాబ్ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. టికెట్స్ ధరలు పెంపుకు నిరాకరించడంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించారు.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిపై దర్శక నిర్మాత నటుడు ఆర్ నారాయణ మూర్తి ప్రశంసల వర్షం కురిపించారు. టికెట్ల ధరలపై వై ఎస్ జగన్ తెచ్చిన ప్రత్యేక జీవో గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు. చాలా ఏళ్లుగా స్టార్ హీరోల సినిమాల టికెట్ ధరలు విషయంలో సరైన నియంత్రణ లేదు. పెద్ద హీరోల సినిమాల విడుదలైన మొదటివారం టికెట్ ధరలు పెంచుకొని అమ్ముకునే సాంప్రదాయం కొనసాగుతుంది. గత ప్రభుత్వాలు దానికి సహకరించాయి. 


అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక జీవో తీసుకు రావడం జరిగింది. ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకోవడం కుదరదు, పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా టికెట్స్, ప్రభుత్వం నిర్ణయించిన సాధారణ ధరలకే విక్రయించాలని జీవో ఆమోదించారు. నిర్ణీత ధరల కంటే అధిక మొత్తానికి టికెట్స్ అమ్మితే చట్ట పరమైన చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. 


ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమా వకీల్ సాబ్ విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. టికెట్స్ ధరలు పెంపుకు నిరాకరించడంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరించారు. ఇక సీఎం జగన్ తీసుకువచ్చిన ఈ జీవో వలన చిన్న సినిమాలు, నిర్మాతల మనుగడ సాధ్యం అవుతుంది అన్నారు. ఈ జీవో తీసుకు వచ్చిన సీఎం జగన్ కి శాల్యూట్ చేస్తున్నాను అంటూ ఆర్ నారాయణ మూర్తి మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలో కూడా జగన్ ప్రభుత్వం గురించి ఆర్ నారాయణ మూర్తి గొప్పగా చెప్పారు. ఆగష్టు 15న తాను నిర్మించిన రైతన్న మూవీ విడుదల కానుందని ఆయన తెలిపారు. 

click me!