పవన్ తో జోడి కడుతున్న నిత్యా మీనన్!

Published : Jul 30, 2021, 11:33 AM IST
పవన్ తో జోడి కడుతున్న నిత్యా మీనన్!

సారాంశం

మళయాళ క్యూటీ నిత్యా మీనన్ బంపర్ ఛాన్స్ కొట్టింది. ఆమె ఏకంగా పవన్ తో జోడి కట్టనుంది. అయ్యప్పనుమ్ కోషియమ్ చిత్రంలో నిత్యా మీనన్ నటిస్తున్నట్లు యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు

పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా  అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తయింది. 

 తాజాగా ఈ సినిమాలో నిత్యామీనన్ ఎంటర్ అయ్యింది. దీనికి సంబంధించి చిత్రబృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిత్యా మీనన్ ఈ సినిమాలో పవన్ సరసన.. ఆయన భార్య గా నటించనుందని తెలుస్తోంది. పవన్ ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాకు పరశురామ కృష్ణమూర్తి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. 

 ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది.ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్