Hrithik Roshan Birthday: విక్రమ్ వేద నుండి హృతిక్ ఫస్ట్ లుక్...

Published : Jan 10, 2022, 11:21 AM ISTUpdated : Jan 10, 2022, 12:00 PM IST
Hrithik Roshan Birthday: విక్రమ్ వేద నుండి హృతిక్ ఫస్ట్ లుక్...

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డే (Hrithik Roshan Birthday)నేడు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ విక్రమ్ వేద నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. హృతిక్ అవుట్ అండ్ అవుట్ మాస్ అవతార్ ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు పెంచేసింది. 

వార్ మూవీతో భారీ హిట్ కొట్టారు హృతిక్ రోషన్(Hrithik Roshan). టైగర్ ష్రాఫ్ మరో హీరోగా నటించిన వార్, 2019 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. చాలా కాలం తర్వాత హృతిక్ ఓ భారీ కమర్షియల్ హిట్ అందుకున్నారు. వార్ మూవీలో హృతిక్ రోషన్ సాహసాలు అబ్బురపరిచాయి. కాగా హృతిక్ ప్రస్తుతం విక్రమ్ వేద మూవీలో నటిస్తున్నారు. నేడు విక్రమ్ వేద ఫస్ట్ లుక్ విడుదల చేశారు. పెరిగిన గడ్డం, గాగుల్స్ ధరించి ఉన్న హృతిక్ శరీరంపై రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. వేద గా కంప్లీట్ మాస్ అవతార్ లో హృతిక్ ఈ మూవీలో సందడి చేయనున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. 

ఇక విక్రమ్ వేద (Vikram Vedha)ఇదే టైటిల్ తో విడుదలైన తమిళ చిత్రానికి అధికారిక రీమేక్. 2017లో విడుదలైన విక్రమ్ వేద కోలీవుడ్ ని ఊపేసింది. అద్భుతమైన కాన్సెప్ట్, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన విక్రమ్ వేద విమర్శుకుల ప్రశంసలందుకుంది. అలాగే ప్రేక్షకులను అలరించింది. క్రిమినల్ వేద గా విజయ్ సేతుపతి నటించగా... అతన్ని వెంటాడే పోలీస్ విక్రమ్ రోల్ మాధవన్ చేశారు. విజయ్ సేతుపతి ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన చిత్రంగా విక్రమ్ వేద నిలిచింది. 

ఎవరైనా పరిస్థితుల ప్రభావంతోనే నేరస్థులుగా మారతారని ఈ మూవీలో దర్శక ద్వయం పుష్కర్-గాయత్రి తెలిపారు. ఆసియాలోనే దర్శకత్వం చేస్తున్న మొదటి భార్యభర్తలుగా పుష్కర్- గాయత్రి రికార్డులకు ఎక్కారు. విక్రమ్ వేద సినిమా వీరిద్దరికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. ఇక హిందీ వెర్షన్ కి కూడా వీరే దర్శకత్వం వహిస్తున్నారు. హృతిక్ ప్రత్యర్థి పోలీస్ విక్రమ్ రోల్ ని సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న విక్రమ్ వేద హిందీ రీమేక్ దాదాపు షూటింగ్ జరుపుకున్నట్లు సమాచారం. 

ఇక 1974 జనవరి 10న జన్మించిన హృతిక్ రోషన్ నేడు 48వ బర్త్ డే జరుపుకుంటున్నారు. దీనితో ఆయనకు సోషల్ మీడియా వేదికగా చిత్ర ప్రముఖులు, ఫ్యాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ నిర్మాత రాకేష్ రోషన్ కొడుకుగా చిత్ర పరిశ్రమకు చైల్డ్ ఆర్టిస్ట్ గా హృతిక్ పరిచయమయ్యారు. 

1980లో విడుదలైన ఆషా మూవీ హృతిక్ మొదటి చిత్రం. ఈ మూవీలో ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. టీనేజ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకు పనిచేశారు. 2000లో విడుదలైన కహోనా ప్యార్ హైన్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగిన హృతిక్ రోషన్ ప్రస్తుతం విక్రమ్ వేద మూవీతో పాటు ఫైటర్ పేరుతో మరో మూవీ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్
Radha Daughter: చిరంజీవి హీరోయిన్ కూతురు, గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయిందో చూడండి