టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలుగు హీరోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘శాకుంతలం’ (Shaakuntalam). క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. పురాణాల్లోని ప్రేమ కథా ఆధాకరంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించారు. దేవ్ మోహన్ - సామ్ జోడీగా నటించగా.. రేపు (April 14)న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో కొద్దిరోజులుగా భారీ ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈక్రమంలో దర్శకుడు గుణశేఖర్ తాజాగా ఓ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తెలుగు హీరోలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్,సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్.. వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఈ విషయంలో మన తెలుగు హీరోలు కూడా కాస్తా మారాల్సిన అవసరం ఉంది. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ అతిధి పాత్ర అయినా అందరినీ అలరించగలిగింది. అలాగే ‘శాకుంతలం’లోనూ దుష్యంతుడి పాత్రకూ తెలుగు హీరోను సంప్రదించాలనుకున్నాను. కానీ చేస్తారనే నమ్మకం లేక వదిలేశాను.
అందుకే ‘శాకుంతలం’ కోసం దేవ్ మోహన్ ను ఎంచుకున్నాం. ఆయన కూడా సినిమా పూర్తయ్యే వరకు ఎలాంటి సినిమానూ ఓకే చేయానని చెప్పారు. దాంతో దేవ్ మోహన్ కు శిక్షణ ఇచ్చి మరీదుష్యంతుడి పాత్ర చేయించుకున్నాను. అంటూ ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేశారు. ఇక శాకుంతలం చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంతోపాటు 3డీ వెర్షన్ లోనూ రేపు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా గురించి కూడా ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ చెప్పారు.
శాకుంతంలో దుర్వాస మహామునిగా మోహన్ బాబు గారు నటించారన్నారు. ఆయన తప్ప మరొకరు చేయడం కష్టమనే చెప్పుకొచ్చారు. సమంత చాలా బాగా నటించిందని శకుంతల పాత్రలో వీలైనంత నటనకు ప్రాధాన్యం ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం కోసం సమంత అరుణ బిక్షుగారి వద్ద శిక్షణ కూడా తీసుకుందని చెప్పుకొచ్చారు.