
ఇంటినిండా లగ్జరీ కార్లు. ఏసీలతో పాటు.. సకల సౌకర్యాలు ఉన్న వాహనాలు. అవి కూడా కాదు అనుకుంటే.. అంకంటే ఎక్కువ ఖరీదైన వెహికిల్స్ వచ్చి ఇంటిముందు నిలుచుంటాయి.. అయినా సరే ఆటో ఎక్కి.. మెట్రో ప్రయాణం చేసి.. ఇల్లు చేరారు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్... డ్రీమ్ గర్ల్ హేమా మాలినీ. ఆమె మెట్రో ప్రయాణం చేశారు. ఆమె అలా చేయడానికి కారణం ఏంటో తెలుసా.. ముంబయ్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం. అసలే ఎండలు, ఈఎండలకు కార్లలో ఏసీలు కూడా పనిచేయడంలేదు. దాంతో జనాలు తట్టుకోలేకపోతున్నారు. దానికి సామాన్యులు సెలబ్రిటీలు అని లేకుండా అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈక్రమంలో ట్రాఫిక్ కు విసిగిపోయిన.. హేమా మాలిని మెట్రో తో పాటు.. ఆటోలో తన గమ్య స్థానం చేరారు.
రీసెంట్ గా ముంబయి శివారులో దహిసర్‌కు వెళ్లారు హేమా మాలిని. ఉదయం స్టార్ట్ అయితే.. సిటీ అవతల ఉన్నఈ ప్రాంతానికి తన ఇంటి నుంచి రెండు గంటల పట్టింది. అసలే 74 ఏళ్ళ వయసులో ఉన్న ఆమె అంత సేపు కూర్చొని ప్రయాణం చేయలేకపోయారు. అంత సేపు ప్రయాణం చేయడంతో హేమ బాగా అలసిపోయారు. దాంతో త్వరగా తాను ఇంటికి చేరుకోవడం కోసం మెట్రోను ఉపయోగించారు.
దహిసర్ నుంచితిరిగి ఈవినింగ్ వచ్చేటప్పుడు కారుకు బదులుగా మెట్రోలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. కారుకంటే ముందే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా ఇల్లు చేరారు హేమా. తెల్లచొక్కా, తెల్లటి ప్యాంటు, గోధుమ రంగు బూట్లు తో డిపణరెంట్ లుక్ లో ఉన్నారు డ్రీమ్ గర్ల్. చేతితో నల్లని బ్యాగుతో మెట్రోలో దర్శనమిచ్చిన సీనియర్ నటిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు. మెట్రోయానం గురించి వివరిస్తూ వివరించారు.
ఇంట్లో లగ్జరీ కార్లు ఉన్నా.. ఆమె సాధారణ మహిళ మాదిరిగా మెట్రో ఎక్కడంతో అక్కడ ప్రయాణికులు అంతా అవాక్కయ్యారు. హేమా మాలినితో ఫోటోలు తీసుకోవడం కోసం పోటీపడ్డారు. ఆమె కూడా విస్సుకోకుండా అందరికి అభివాదం చేసి.. అడిగిన వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా మెట్రో, ఆటోలో జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు హేమా మాలిని. అంతే కాదు తన అనుభవాలు ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు. హేమా మాలిని మెట్రోలో ప్రయాణించిన వీడియోతో పాటు.. ఆటోలో తన ఇంటకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.