రాజ్‌కుంద్రాకి మరో షాక్‌.. శిల్పా శెట్టి భర్తపై సచినో జోషి సంచలన వ్యాఖ్యలు

By Aithagoni RajuFirst Published Jul 23, 2021, 4:31 PM IST
Highlights

 రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యయుగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

పోర్న్ చిత్రాల కేసులో అరెస్ట్ అయిన రాజ్‌కుంద్రాకి మరో షాక్‌ తగిలింది. సత్యయుగ్‌ గోల్చ్ స్కీమ్‌ కేసులో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిలపై నటుడు సచిన్‌ జోషి విజయం సాధించారు.  అంతేకాదు ఈ సందర్బంగా రాజ్‌కుంద్రాపై సచిన్‌ జోషి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చేసిన పాపం ఊరికే పోదంటూ మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే, రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, సత్యయుగ్ గోల్డ్ బంగారు పథకంలో తనను మోసం చేశారని ఆరోపించిన సచిన్ జోషి ఈ ఏడాది జనవరిలో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తాజాగా కోర్టు జోషికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

జోషికి కిలో బంగారాన్ని అప్పగించడంతోపాటు, కోర్టు ఖర్చుల కింద మూడు లక్షలు రూపాయలు  చెల్లించాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. దీంతో రాజ్‌కుంద్రాకి మరో షాక్‌ తగిలినట్టయ్యింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా,  `సత్యయుగ్  గోల్డ్` కంపెనీలో  అప్పటికి డైరెక్టర్లుగా ఉన్నారు. తక్కువ రేటుకే బంగారం స్కీం పేరుతో పలువురి వద్ద డబ్బులు సేకరించారు. దాన్ని న‌మ్మిన స‌చిన్ జోషి కిలో బంగారాన్ని ఆ కంపెనీలో ఇన్వెస్ట్‌గా పెట్టాడు. ఐదేళ్లు పూర్త‌యిన త‌ర్వాత స‌చిన్ జోషీకి బంగారం తిరిగి ఇవ్వ‌కుండా రాజ్‌కుంద్రా కంపెనీ అడ్డుగోలుగా వ్య‌వ‌హ‌రించింది.  ఈ నేపథ్యంలోనే  జోషి కేసులో తాజా తీర్పు వెలువడింది.

దీనిపై నటుడు సచిన్‌ జోషి స్పందించారు. ఆరేళ్లు తను కష్టపడి దాచుకున్న డబ్బును అక్రమంగా కాజేయాలని చూశారు. 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా సంస్థ 25 లక్షలు డిమాండ్‌ చేసిందని మండిపడ్డారు. తనబంగారాన్ని తనకివ్వమని అడిగితే, రివర్స్‌లో  తనపైనే బురద చల్లారన్నారు. చేసిన పాపాలు ఎక్కడిపోతాయి...కర్మ అనుభవించక తప్పదంటూ వ్యాఖ్యానించారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా బాధితులు ఇంకా చాలామంది ఉన్నారని పేర్కొన్నారు.  మరోవైపు సోమవారం అర్థరాత్రి అరెస్ట్‌ చేసినరాజ్‌కుంద్రా రిమాండ్‌ను మరో మూడు రోజుల పాటు  పొడిగించారు. జూలై 27వరకు పోలీసు కస్టడీకి తరలించారు. ఇదిలా ఉంటే తెలుగు, హిందీలో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్‌ జోషి గతేడాది గుట్కా అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.

The truth had to be out one day..!! https://t.co/22CqDvKTUF

— Sachiin (@sachiinjoshi)
click me!