రాజ్‌కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ..ఈ నెల 27 వరకు పోలీస్‌ కస్టడీ

Published : Jul 23, 2021, 03:23 PM IST
రాజ్‌కుంద్రా బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ..ఈ నెల 27 వరకు పోలీస్‌ కస్టడీ

సారాంశం

బెయిల్‌ కోసం రాజ్‌కుంద్రా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ని కోర్ట్ తిరస్కరించింది. ఆయన్ని మరో నాలుగు రోజులపాటు అంటే ఈ నెల 27 వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతినిచ్చింది. 

నీలిచిత్రాల కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త నాలుగు రోజుల క్రితం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నెల 23వరకు ఆయన పోలీస్‌ కస్టడీకి ముంబయి కోర్ట్ అనుమతినిచ్చింది. తాజాగా బెయిల్‌ కోసం రాజ్‌కుంద్రా పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ని కోర్ట్ తిరస్కరించింది. ఆయన్ని మరో నాలుగు రోజులపాటు అంటే ఈ నెల 27 వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతినిచ్చింది. 

శుక్రవారం ఆయన్ని కోర్ట్ ముందు ప్రవేశ పెట్టగా కోర్ట్ బెయిల్‌ని తిరస్కరించడంతోపాటు పోలీసుల రిక్వెస్ట్ మేరకు జులై 27 వరకు  పోలీసుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన్ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. రాజ్‌ కుంద్రా నుంచి పోర్నోగ్రఫీచిత్రాల కేసులో మరింత లోతుగా విచారించనున్నారు. 

ఐపీఎల్‌ టీమ్‌ రాజస్థాన్‌ రాయల్స్ మాజీ కో హోనర్‌, వ్యాపారవేత్త అయిన రాజ్‌కుంద్రా పలువురు మోడల్స్ ని, అమ్మాయిలను వెబ్‌ సిరీస్‌లో ఆఫర్లు ఇస్తామని ఆకర్షించి, వారిచేత బలవంతంగా నీలిచిత్రాలు తీస్తున్నట్టు ఆరోపణలో సోమవారం రాత్రి పోలీసులు రాజ్‌కుంద్రాని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పక్కా ఆధారాలతోనే ఆయన్ని అరెస్ట్ చేసినట్టు ముంబయి పోలీసులు తెలిపారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Ram Charan: రాంచరణ్, ప్రభాస్ జాతకాల్లో అది లేదు.. అయినా ఎలా సాధ్యమైంది ? దెబ్బకు ఫ్యూజులు అవుట్
Ram Charan: రెండేళ్ల కూతురు క్లీంకారాను చుట్టుముట్టిన అభిమానులు, రామ్ చరణ్ కోపం