హీరోయిన్ పై నోరు పారేసుకున్న దర్శకుడు

Published : Sep 29, 2017, 05:27 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
హీరోయిన్ పై నోరు పారేసుకున్న దర్శకుడు

సారాంశం

మరోసారి వివాదాల్లోకి ఎక్కిన తమిళ దర్శకుడు రాజేందర్ హీరోయిన్ ధన్షికపై విరుచుకుపడ్డ రాజేందర్ కన్నీటి పర్యంతమైన ధన్షిక

తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు టి. రాజేందర్ మరో సారి వివాదానికి క్రేందమయ్యారు. మీడియా ఏదుటే ఓ హీరోయిన్ పై నోరుపారేసుకున్నారు. అసలేం జరిగిందంటే.. కబాలీ ఫేం దన్షిక హీరోయిన్ గా తమిళంలో ‘ విళితురు’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మట్లాడిని ధన్షిక..  చిత్రం కోసం పనిచేసిన అందరి గురించి మట్లాడి రాజేందర్ గురించి మట్లాడటం మర్చిపోయింది.

 

దీంతో అవమానంగా భావించిన రాజేందర్ .. ధన్షికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రజినీ కాంత్ పక్కన నటించినంత మాత్రాన స్టార్ హీరోయిన్లు అయిపోరని సూచించారు. పెద్దవాళ్లకు గౌరవం ఇస్తేనే భవిష్యత్తు ఉంటుందని హితవు పలికారు. ఆయన మాటలకుషాక్ తిన్న ధన్షిక.. పొరపాటు జరిగిందని.. చెబుతున్నా.. రాజేందర్ వినిపించుకోలేదు. తోటి ఆర్టిస్టులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖిన్నురాలైన ధన్షిక అక్కడే కన్నీటి పర్యంతమైంది. అసలు విషయం ఏమింటే.. రాజేందర్ అసలు ఈ సినిమాలో నటించలేదట. కేవలం ఒక పాట మాత్రమే పాడటం కొస మెరుపు

 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?