భార్యను మిస్ అవుతున్నానన్న అల్లు అర్జున్

Published : Sep 29, 2017, 04:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
భార్యను మిస్ అవుతున్నానన్న అల్లు అర్జున్

సారాంశం

‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ షూటింగ్ లో అల్లు అర్జున్ ఊటీలో  ఆయుధ పూజ చేసుకున్న ‘ నా పేరు సూర్య..’ చిత్ర బృందం భార్యను మిస్ అవుతున్నానన్న అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి నేడు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోంది. అయితే 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా షూటింగులో బన్నీ వేరే చోట ఉండటంతో ట్విట్టర్ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్ డే స్నేహ. ఐ మిస్ యు క్యూటీ' అంటూ ట్వీట్ చేశాడు. అర్జున్, స్నేహలు వివాహం 2011లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు కూడా ఉన్నారు.

 

ప్రస్తుతం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా షూటింగ్ లో భాగంగా అల్లు అర్జున్.. ఊటీలో ఉన్నారు. అక్కడ తమ చిత్ర బృందంతో కలిసి ఆయుధ పూజ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఈ షూటింగ్ కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు స్టైలిష్ స్టార్. ఒకానొక సందర్భంలో కెరీర్, ప్రేమ ఏది ఎంచుకోవాలనే సందిగ్ధ పరిస్థితిలో కొట్టుమిట్టాడానని, ఆ సమయంలో స్నేహారెడ్డిని మిస్సవుతానేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ వెల్లడించారు. 'దేశ ముదురు' సినిమా షూటింగ్ సమయంలో తనకు ఈ పరిస్థితి ఎదురైందని చెప్పిన అల్లు అర్జున్ అప్పటి విషయాలను నెమరు వేసుకున్నారు.

 

ఒక వేళ షూటింగ్ కోసం మనాలి వెళ్తే, స్నేహను మిస్ అయిపోతానేమో అనే భయం వేసిందని అయితే, షూటింగుకే ప్రాధాన్యతను ఇచ్చి మనాలి వెళ్లానని చెప్పారు అప్పుడు తాను సరైన నిర్ణయం తీసుకున్నానని  తర్వాత స్నేహ ప్రేమను పొందాను అని అల్లు అర్జున్ తెలిపారు. అల్లు అర్జున్ కి తన భార్యపై ఉన్న ప్రేమను చూసి మురిసిపోతున్నారు ఆయన అభిమానులు.

PREV
click me!

Recommended Stories

Sivakarthikeyan: కారు ప్రమాదం నుంచి తప్పించుకున్న శివకార్తికేయన్, నడిరోడ్డుపై గొడవ సెటిల్ చేసిన హీరో
Ashika Ranganath: దాదాపు 30 ఏళ్ళ వయసు తేడా ఉన్న ముగ్గురు హీరోలతో రొమాన్స్.. హీరోయిన్ రియాక్షన్ వైరల్