పవన్ పై బోయపాటి కామెంట్స్ వెనక అసలు మేటర్ ఇదే?

Published : Oct 21, 2023, 12:41 PM IST
పవన్ పై బోయపాటి కామెంట్స్ వెనక అసలు మేటర్ ఇదే?

సారాంశం

జ‌న‌సేనానిపై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కామెంట్ ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.   


పవన్ కళ్యాణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా జరగలేదు.తాజాగా పవన్ కళ్యాణ్ పై బోయపాటి శ్రీను ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. అందులో ఈ విషయాల ప్రస్తావన కూడా వచ్చింది. ఇంత‌కీ ప‌వ‌న్ పై బోయ‌పాటి ఏమ‌ని కామెంట్ చేసారు? ఈ కామెంట్స్ వెనక అసలు విషయం ఏమిటీ? అంటూ అభిమానుల్లో ఆరాలు మొద‌ల‌య్యాయి. ఇంత‌కీ బోయ‌పాటి ఏమ‌న్నారు? అంటే..

 ''పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫిల్టర్ లేని వాడు.. ఎది అనుకుంటే అది చేస్తాడు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ నిలబడతాడు. ఎక్కడ నిజాయితీ ఉంటే అక్కడ ఉంటాడు. న్యాయం ఉన్న చోట అడ్డ సుడిగా నిలబడతాడు'' అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఒక ర‌కంగా పవన్ కళ్యాణ్  లో ఉత్సాహం నింపే కామెంట్స్ ఇవి. ప‌వ‌న్ వ్య‌క్తిత్వాన్ని బోయ‌పాటి త‌న‌దైన శైలిలో పొగిడేశారు. అయితే ఇదే సమయంలో హఠాత్తుగా పవన్ గురించి బోయపాటి మాట్లాడటం వెనక  లాజిక్ ఏమిటి? అంటూ సోషల్ మీడియా జనం  వెతుకుతున్నారు.  అయితే వాళ్లలో కొందరు అనేది ఏమిటంటే రీసెంట్ గా తెలుగుదేశంకు పవన్ కళ్యాణ్ బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ఇద్దరు కలిసే ముందుకు ఎలక్షన్స్ వెళ్దామని అన్నారు. ఇక మొదటి నుంచి బోయపాటి తెలుగుదేశం కు పూర్తి స్దాయి మద్దతు దారు. అందుకే ఇప్పుడు పవన్ గురించి ఇలా బోయపాటి మాట్లాడారు అని చెప్తున్నారు. 

ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే వీళ్లద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అదిరిపోతుందనేది నిజం. బోయపాటి మొదటి నుంచీ కూడా యాక్షన్ .. ఎమోషన్ ను సమపాళ్లలో కలుపుకునే కథలను రెడీ చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన సినిమాల్లో మాస్ ఆడియన్స్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వాళ్ల నుంచి ఆయన సినిమాలకు ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది.  ఆ మధ్యన  లాక్ డౌన్ సమయంలో పవన్ కోసం బోయపాటి ఒక పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశాడట. మాస్ యాక్షన్ తో పాటు పొలిటికల్ టచ్ ఉండే ఈ కథను పవన్ కి వినిపించారట. అయితే వర్కవుట్ కాలేదని అంటారు.  

 పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతోనూ అలానే మరోపక్క రాజకీయాలతోనూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే రీఎంట్రీ తరువాత వరుసగా వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలతో బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ సినిమా ఒకటి ఇంకా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న హరిహర వీరమల్లు సినిమా ఒకటి. ఈ మూడు సినిమాలు కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఓటీటీలో మీకోసం వీకెండ్‌ లో దుమ్మురేపే 5 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Karthika Deepam 2 Today Episode: కాశీని రెచ్చగొట్టిన వైరా- శ్రీధర్ అరెస్ట్- రక్తం కక్కుకున్న సుమిత్ర