ఉస్తాద్ లో ఆ డైలాగ్ పెట్టా..ఇస్రోని మించే పోటుగాళ్ళు లేరిక్కడ, సనాతన ధర్మాన్ని కించపరిచే వారికి హరీష్ ఆన్సర్

By Asianet News  |  First Published Oct 21, 2023, 12:35 PM IST

తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ 'సర్వం శక్తి  మయం' వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో హరీష్.. సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి అద్భుతంగా ప్రసంగించారు. 


తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత సనాతన ధర్మం గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఉదయనిధి స్టాలిన్ పై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అంటూ ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ 'సర్వం శక్తి  మయం' వెబ్ సిరీస్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. 

ఈ ప్రెస్ మీట్ లో హరీష్.. సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి అద్భుతంగా ప్రసంగించారు. ఈ మధ్యన సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 

Latest Videos

దేవుడు ఉన్నాడా లేదా నాస్తికత్వంలాంటి డిబేట్లకు నేను వేళ్లను.భయపడి కాదు.. నన్ను భరించలేరు అని. మూడవతరగతి పిల్లవాడికి పైథాగరస్ సిద్ధాంతం, న్యూటన్ సిద్ధాంతాలు చెబితే అవి అర్థం కావు. అంత మాత్రం చేత ఆ సిద్ధాంతాలు లేనట్లు కాదు. భగవంతుడు కాన్సెప్ట్ కూడా అంతే. మీకు అర్థం కానంత మాత్రాన అక్కడ ఏమీ లేదు అని కాదు. 

కొంతమంది హిపోక్రసితో మాట్లాడుతుంటారు. నేను దేవుడిని నమ్మను కానీ ఏదో శక్తి ఉందండి అని అంటుంటారు.  శక్తికి సంబంధించిన ఎలాంటి నిర్వచనం అయినా భగవంతుడికి కూడా అప్లై అవుతుంది. శక్తిని మనం చూడలేం ఆస్వాదించగలం అంతే. భగవంతుడు కూడా అంతే. 

హిందూ మతం వేరు.. హిందూ ధర్మం వేరు. భారత దేశం హిందూ మతంతో ఉన్నప్పటికీ హిందూ ధర్మం మీద నిలబడింది. హిందూ మతం బొట్టు పెట్టుకోమని చెబుతుంది. కానీ హిందూ ధర్మం పక్కవాడికి అన్నం పెట్టమని చెబుతుంది. ఆ పక్కవాడికి బొట్టు ఉందా లేదా అని హిందూ ధర్మం చూడదు. 

కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ ఇస్లాం, క్రిస్టియానిటీ, జైనిజం స్వేచ్ఛగా వ్యాపించాయి. దానికి కారణం హిందూ ధర్మం. నువ్వు ఆ రూట్ లో వెళ్లినా ఈ రూట్ లో వెళ్లిన చివరకి చేరే డెస్టినీ ఒక్కటే అని చెప్పేదే సనాతన ధర్మం అని హరీష్ అన్నారు. 

ధర్మాన్ని నమ్మేవాడే గుడికి రావాలి.. ధర్మాన్ని ప్రశ్నించేవాడు కాదు.. ఇది ఉస్తాద్ భగత్ సింగ్ లో కూడా రాశాను. భక్తి అనేది వ్యక్తిగతం. గుడి అనేది రిలీజియస్ ప్లేస్. అది ప్రభుత్వ ఆసుపత్రో ప్రభుత్వ స్కూల్ కాదు ఎవడు పడితే ఆడు వెళ్లడానికి. అది సెక్యులర్ ప్లేస్ కాదు. ఆ నమ్మకం ఉన్నవారు మాత్రమే గుడికి వెళ్ళాలి. మతం తర్వాతే సైన్స్ వచ్చింది. చంద్రుడిపైకి చంద్రయాన్ 3 పంపినా ముందుగా వాళ్ళు వెళ్ళింది తిరుపతికే. ఇస్రోని మించే పోటుగాళ్ళు లేరిక్కడ. కాబట్టి సనాతన ధర్మానికి వ్యతిరేకంగా కామెంట్స్ వద్దు అని హరీష్ సూచించారు. 

click me!