నాని, వివేక్ ఆత్రేయ చిత్రానికి వెరైటి టైటిల్

By Surya Prakash  |  First Published Oct 21, 2023, 12:17 PM IST

 వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నారు నాని. వీరిద్దరూ కలసి ‘అంటే సుందరానికీ’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. 



నానితో ‘అంటే సుందరానికి’ లాంటి  కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో నాని తన 31వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అంటే సుందరానికి సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకోవటంతో మరో సినమా దక్కింది.  దాంతో  దర్శకుడు వివేక్ ఆత్రేయ తో నాని 31వ సినిమా కమిటయ్యారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యి ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 ఈ సారి అంటే సుందరానికి లాంటి సాఫ్ట్ సినిమా కాకుండా దసరా లాంటి యాక్షన్ ఎలిమెంట్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ యాక్షన్ ఇమేజ్ ని మించి నాని తో యాక్షన్ మూవీ ప్లాన్ చేస్తున్నారు వివేక్ ఆత్రేయ.  ఈ సినిమాకు సరిపోదా శనివారం (Saripodha Sanivaaram Movie) టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. 'మెంటల్ మదిలో', 'బ్రోచేవారెవరురా', 'అంటే సుందరానికి'... ఇప్పటి వరకు వివేక్ ఆత్రేయ తీసిన ప్రతి సినిమాకు వెరైటీ టైటిల్ పెట్టారు. ఈ సినిమాకు కూడా ఆ విధంగా ముందుకు వెళుతున్నట్లు అర్దమవుతోంది.  

Latest Videos

'సరిపోదా శనివారం' సినిమాను శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'ఓజీ'కి కూడా ఆయనే నిర్మాత. ఇక, 'సరిపోదా శనివారం' విషయానికి వస్తే... ఈ సినిమాలో  హీరోయిన్ గా ప్రియాంకా అరుల్ మోహన్ ఎంపిక అయ్యారు. దానయ్య నిర్మిస్తున్న 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలో కూడా ఆమె హీరోయిన్. ఓ నిర్మాణ సంస్థలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేస్తోంది. 

ప్రస్తుతం శౌర్యువ్ తో నాని తన 30వ సినిమా చేస్తున్నారు. హాయ్ నాన్న' సినిమా డిసెంబర్ 7న విడుదల కానుంది. తొలుత ఆ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయాలని భావించినా... ప్రభాస్ 'సలార్' వస్తుండటంతో ముందుకు జరిపారు.  
 

click me!