డైరెక్టర్‌కే 100 కోట్ల పారితోషికమా? ఇలా అయితే అల్లు అర్జున్‌ సినిమా కష్టమే? కథ మళ్లీ మొదటికి

Published : Mar 01, 2025, 05:37 PM IST
డైరెక్టర్‌కే 100 కోట్ల పారితోషికమా? ఇలా అయితే అల్లు అర్జున్‌ సినిమా కష్టమే? కథ మళ్లీ మొదటికి

సారాంశం

అల్లు అర్జున్‌, అట్లీ కాంబినేషన్‌లో సినిమా రావాల్సి ఉంది. ఈ మూవీ కోసం అట్లీ వంద కోట్ల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడట. దీంతో ప్రాజెక్ట్ క్యాన్సిల్‌ అయ్యే అవకాశాలున్నాయట.   

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవలే `పుష్ప 2`తో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఈ మూవీ 1872కోట్లు వసూలు చేసినట్టు టీమ్ ప్రకటించింది. ఇప్పుడు కాస్త బ్రేక్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ నెక్ట్స్ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. త్రివిక్రమ్‌తో ఓ మూవీ చేయాల్సి ఉంది. మరోవైపు అట్లీతో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండింటిలో ఏది మొదలు అనే సందిగ్దం నెలకొంది. 

కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా అల్లు అర్జున్‌- అట్లీ సినిమా..

అయితే బన్నీ ఇప్పుడు అట్లీతో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఆయన మూవీనే త్వరగా పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుంది. `జవాన్‌` తరహాలో అట్లీ ట్రీట్‌మెంట్‌ ఉంటుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ని గీతా ఆర్ట్స్ నిర్మించబోతుంది. అయితే ఈ సినిమాని ప్రారంభమవడానికి అంతా ఓకే, కానీ ఒకే ఒక్క విషయం ప్రాజెక్ట్ నే ఆయోమయంలో పడేస్తుంది. దర్శకుడు అట్లీ డిమాండ్‌ ఇప్పుడు షాకిస్తుంది. 

అల్లు అర్జున్‌ సినిమాకి దర్శకుడు అట్లీ పారితోషికం వంద కోట్లు.. 

అల్లు అర్జున్‌తో సినిమా కోసం అట్లీ ఏకంగా వంద కోట్ల పారితోషికం అడుగుతున్నాడట. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈమూవీకి బన్నీ సుమారు రూ. 150కోట్లు పారితోషికంగా తీసుకునే అవకాశం ఉంది. అంటే వీరిద్దరికే రూ250కోట్లు, హీరోయిన్‌, ఇతర కాస్టింగ్‌కి మరో యాభై కోట్లు.

అంటే మూడు వందల కోట్లు కాస్టింగ్‌కి, మరో యాభై కోట్లు టెక్నీషియన్లకి, ప్రొడక్షన్‌ కాస్ట్‌ మరో రెండు వందల కోట్లు. ఈ లెక్కన ఈ మూవీ బడ్జెట్‌ 500-600కోట్లు అవుతుంది. ఇంత భారీ బడ్జెట్‌ అంటే పెద్ద రిస్క్. దీనిపై 1000కోట్ల బిజినెస్‌ జరగాలి. సుమారు 1500కోట్ల కలెక్షన్లు రావాలి. మరి అది సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న. 

read  more: నయనతార, రష్మిక, అనుష్క, త్రిషలకు సాయిపల్లవి ఝలక్‌, `రామాయణ్‌`కి ఆమె తీసుకునే పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్

అట్లీ కోసం నిర్మాతలు రిస్క్ చేస్తారా?

ఈ విషయంలోనే నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఇదే తేలడం లేదు. దర్శకుడు అట్లీ ఈ విషయంలో తగ్గేదెలే అంటున్నారు. అయితే గతంలోనూ ఇదే సమస్య వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్నారు. కానీ ఇటీవల మళ్లీ చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు మరోసారి పారితోషికమే తెగడం లేదు. మరి నిర్మాతలు ధైర్యం చేస్తారా? ప్రాజెక్ట్ నే క్యాన్సిల్‌ చేసుకుంటారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. సినిమాపై అనుమానాలకు తావిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.

ఈ ఏడాది ద్వితీయార్థంలో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ మూవీ..

ఇక అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కాల్సింది. ఈ మూవీ ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఉంటుందని నిర్మాత నాగవంశీ తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని మైథలాజికల్‌ మూవీగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. దీన్ని హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుంది. సుమారు వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ అని సమాచారం. 
 

read  more: ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ మూవీకి హీరోయిన్‌ ఫిక్స్.. రవితేజ హీరోయిన్‌తో డార్లింగ్‌ రొమాన్స్ ?

also read: రాజశేఖర్‌, శంకర్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? రోజూ ఇంటికి తిరిగినా మొహం మీదే నో చెప్పాడా?

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ