ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ మూవీకి హీరోయిన్‌ ఫిక్స్.. రవితేజ హీరోయిన్‌తో డార్లింగ్‌ రొమాన్స్ ?

Published : Mar 01, 2025, 04:29 PM IST
ప్రభాస్‌, ప్రశాంత్‌ వర్మ మూవీకి హీరోయిన్‌ ఫిక్స్.. రవితేజ హీరోయిన్‌తో డార్లింగ్‌ రొమాన్స్ ?

సారాంశం

ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు ఐదు సినిమాలున్నాయి. తాజాగా మరో మూవీ యాడ్‌ అయ్యింది. ఈ కొత్త చిత్రంలో రవితేజ హీరోయిన్‌తో రొమాన్స్ కి రెడీ అవుతున్నారట డార్లింగ్‌.   

ప్రభాస్‌ టాలీవుడ్‌ గ్లోబల్‌ స్టార్‌. ఇండియన్‌ సినిమాకి ఆయనే దిక్సూచి. ప్రభాస్‌ డిఫరెంట్‌ మూవీస్‌తో రాబోతున్నారు. ఇండియన్‌ సినిమాల్లోనే ఎవరికీ లేని లైనప్‌ ఆయన సొంతం. అంతేకాదు దేనికదే డిఫరెంట్‌ మూవీస్‌. ఓ రకంగా ఆల్‌ రౌండర్‌ జోనర్స్ మూవీస్‌ చేస్తున్న ఏకైక హీరోగా ప్రభాస్‌ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఆయన రవితేజ హీరోయిన్‌తో రొమాన్‌ చేయబోతున్నారట. ఆ కథేంటో చూద్దాం. 

`ది రాజా సాబ్‌`, `ఫౌజీ`, స్పిరిట్‌`.. డిఫరెంట్‌ మూవీస్‌తో వస్తున్న ప్రభాస్‌..

ప్రభాస్‌ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు `ది రాజా సాబ్‌` మూవీ చేస్తున్నారు. దీనికి మారుతి దర్శకుడు. హర్రర్‌ థ్రిల్లర్‌, రొమాంటిక్‌ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్‌ రాజు తరహా పాత్రలో కనిపిస్తారట. ఆయనలోనే హర్రర్‌ ఎలిమెంట్లు ఉంటాయని సమాచారం. ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఏప్రిల్‌లో ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

ఇంకోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో `ఫౌజీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వార్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సాగే మూవీ. వార్‌, లవ్‌ స్టోరీ ప్రధానంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇందులో సైనికుడిగా ప్రభాస్‌ కనిపిస్తాడట. ఇందులో సోషల్‌ మీడియా సెన్సేషన్‌ ఇమాన్విని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ జరుపుకుంటోంది. దీంతోపాటు త్వరలో `స్పిరిట్‌` మూవీ ప్రారంభం కానుంది. 

ప్రశాంత్‌ వర్మ సినిమాలో ప్రభాస్‌ సరసన హీరోయిన్‌ ఫిక్స్ 

అయితే ఆ తర్వాత ప్రశాంత్‌ వర్మ మూవీ ఉండబోతుందట. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభాస్‌పై టెస్ట్ షూట్‌ చేశారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. అయితే ఇందులో హీరోయిన్‌ భాగ్య శ్రీ బోర్సే కూడా పాల్గొందట. ఇదే అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో మరో విషయాన్ని క్లారిటీ ఇస్తుంది. ఇందులో హీరోయిన్‌గా భాగ్య శ్రీ బోర్సే అనే విసయాన్ని కన్ఫమ్‌ చేస్తుంది. 

భాగ్య శ్రీ బోర్సే ఇప్పుడు టాలీవుడ్‌లో యంగ్‌ సెన్సేషన్‌గా మారిన విసయం తెలిసిందే. ఆ మధ్య ఆమె రవితేజతో `మిస్టర్‌ బచ్చన్‌`లో నటించి ఆకట్టుకుంది. తనదైన గ్లామర్‌, నటన, డాన్సులతో ఇరగదీసింది. ఇప్పుడు తెలుగులోనే రెండు మూడు ప్రాజెక్ట్ చేస్తుంది.

అందులో రామ్‌ పోతినేని మూవీ కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్‌కి జోడీగా ఎంపికైందని సమాచారం. ఈ మూవీకి `బ్రహ్మరాక్షసుడు` అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారట. ఈ మూవీ `స్పిరిట్‌` తర్వాత ప్రారంభం అవుతుందని తెలుస్తుంది. 

`సలార్‌2`, `కల్కి 2` కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్ వెయిటింగ్‌..

ఇప్పటికే ప్రభాస్‌ చేయాల్సిన మరో రెండు చిత్రాలున్నాయి. ప్రశాంత్‌ నీల్‌ `సలార్‌ 2`, నాగ్‌ అశ్విన్‌ `కల్కి 2` కోసం ఆడియెన్స్ వెయిట్‌ చేస్తున్నారు. ఈ మూవీస్‌ ప్రశాంత్‌ వర్మ సినిమా తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడు వస్తాయో చూడాలి. కానీ ఫ్యాన్స్ మాత్రం అన్నింటికంటే ఎక్కువగా ఈ రెండు చిత్రాల కోసమే వెయిట్‌ చేస్తున్నారని చెప్పొచ్చు. 

read  more: రాజశేఖర్‌, శంకర్‌ కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? రోజూ ఇంటికి తిరిగినా మొహం మీదే నో చెప్పాడా?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌
Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌