ప్రముఖ కమెడియన్, సీఎం స్టాలిన్ స్నేహితుడు మృతి.. చికిత్స తీసుకున్న రెండవరోజే..

By Asianet News  |  First Published Feb 5, 2023, 6:28 PM IST

తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ దర్శకుడు, కమెడియన్ టీపీ గజేంద్రన్(68) కన్నుమూశారు. గజేంద్రన్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.


చిత్ర పరిశ్రమలో విషాదాలు ఆగడం లేదు. కె విశ్వనాథ్, దర్శకుడు సాగర్, గాయని వాణీ జయరామ్ ఇలా ప్రముఖులు తక్కువ వ్యవధిలోనే శాశ్వతంగా దూరమయ్యారు. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ దర్శకుడు, కమెడియన్ టీపీ గజేంద్రన్(68) కన్నుమూశారు. 

గజేంద్రన్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గజేంద్రన్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని శనివారం ఇంటికి తిరిగి వచ్చారట. కానీ ఊహించని విధంగా ఆదివారం రోజు ఆయన మృత్యువాత పడ్డారు. గజేంద్రన్ తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, కమెడియన్ గా రాణించారు. 

Latest Videos

undefined

హాస్య ప్రధానమైన చిత్రాలు తెరకెక్కించడంలో ఆయన సిద్ధహస్తుడు. బడ్జెట్ పద్మనాభన్, మిడిల్ క్లాస్ మాధవన్, పాండి నట్టు తంగం లాంటి చిత్రాలు తెరకెక్కించారు. అలాగే కమెడియన్ గా కూడా నవ్వించారు. 100కి పైగా చిత్రాల్లో గజేంద్రన్ నటించడం విశేషం. ఆయన తెరకెక్కించిన బడ్జెట్ పద్మనాభన్ చిత్రం 2001లో బడ్జెట్ పద్మనాభంగా తెలుగులో రీమేక్ అయింది. ఈ చిత్రంలో జగపతి బాబు నటించారు. 

ఇక టీపీ గజేంద్రన్ గురించి మరో ఆసక్తికర విషయం.. ఆయన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కి క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ కాలేజీలో క్లాస్ మేట్స్. గజేంద్రన్ మరణించడంతో సీఎం స్టాలిన్ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు. మంచి దర్శకుడు, నటుడిని చిత్ర పరిశ్రమ కోల్పోయింది అంటూ తమిళ సినీ ప్రముఖులు అంటున్నారు. గజేంద్రన్ ని నివాళులు అర్పిస్తున్నారు. 

click me!