అల్లు అర్జున్ కు కొడుకు అయాన్ ఊహించని గిఫ్ట్.. ఆనందంతో పొంగిపోతున్న బన్నీ.. ఇంతకీ ఏంటది?

By Asianet News  |  First Published Feb 5, 2023, 4:53 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్యామిలీతో ఎంత సరదాగా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా  కొడుకు, కూతురు అంటే బన్నీకి పంచప్రాణాలు. అయితే ఐకాన్ స్టార్ కు కొడుకు అయాన్ తాజాగా ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.


సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడుపుతుంటారు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో బన్నీ తన కూతురు, కొడుకుతో చేసే అల్లరి పనులు, క్యూట్ సంభాషణలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. బన్నీ - స్నేహా రెడ్డికి ఇద్దరు  పిల్లలున్న విషయం తెలిసిందే. కొడుకు అయాన్ (Ayaan), కూతురు అర్హా (Arha)తో అల్లు అర్జున్ ఎంత ఫ్రెండ్లీగా చూస్తూనే ఉన్నాం. అయితే అదే తరహాలో బన్నీని కూడా పిల్లలు సర్ ప్రైజ్ చేస్తూనే ఉంటారు. 

అల్లు అర్జున్ షూటింగ్ నుంచి ఇంటికి తిరిగినా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడం.. చిన్న చిన్న గిఫ్ట్ లతో సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఇందుకు బన్నీ చాలాసార్లు ఆనందం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొడుకు అయాన్ అల్లు అర్జున్ కు ఈరోజు ఊహించని గిఫ్ట్ బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. దీంతో బన్నీ సంతోషంలో మునిగితేలుతున్నారు. తన కొడుకు అందించిన బహుమతిని చూపిస్తూ పొంగిపోతున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 

Latest Videos

ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటంటే.. ‘ఫుష్ఫ’తో ఐకాన్ స్టార్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. PushpaRaj గా బన్నీకి ఇండియా వైడ్ గా ఎంతటి క్రేజ్ వచ్చిందో చూశాం. ఈ క్రమంలో బన్నీకి ఆయాన్ ‘లారీ’(Toy)ని బహుమతిగా అందించారు. దానిపై పుష్ప అనే టైటిల్ కనిపిస్తుంది. భారీ సక్సెస్ ను అందించిన ఈ చిత్ర విజయాన్ని గుర్తు చేస్తూ ఆయాన్ ఇలాంటి గిఫ్ట్ అందించడంతో అల్లు అర్జున్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆయాన్ అందించిన లారీ బొమ్మ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నా చిన్నిబాబు అయాన్ నుండి అందమైన బహుమతి #pushpa’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప ది రూల్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్ ను మైత్రీ మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం టీమ్ 10 రోజుల షూటింగ్ కోసం వైజాగ్‌కు వెళ్లింది. షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండటం విశేషం. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది చిత్రం. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ కోసం స్టార్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. 

 

click me!