‘మైకేల్’రిజల్ట్ మరీ అంత తేడానా ?

By Surya PrakashFirst Published Feb 5, 2023, 5:58 PM IST
Highlights

గ్యాంగ్ స్టార్ నేపథ్యం లో మైఖేల్ అనే సినిమా ను సందీప్ కిషన్ చేశాడు.ఆ సినిమా కు సంబంధించి అంచనాలు భారీగా నమోదయ్యాయి.


మైఖేల్ గా రెండు రోజుల క్రితం  ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు యంగ్ హీరో సందీప్ కిష‌న్.. ఈ చిత్రం సందీప్ కిషన్ కెరీర్ లో నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్తుందని చాలా ఆశలు పెట్టుకున్నాడు. తమళ డైరక్టర్ ఈ సినిమాని స్టైలిష్ మేకింగ్ తో తీర్చిదిద్దాడు. ఈ సినిమా ప్రోమోలుకు మంచి రెస్పాన్సే వచ్చింది. ట్రేడ్ లో కూడా ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి స్టార్స్ నటించడం తో అంచనాలు భారీగా పెరిగాయి. సందీప్ కెరీర్ ఈ సినిమాతో మలుపు తిరిగేలా ఉందని, అటు తమిళంలోనే కాక తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయిపోవడం పక్కా అని లెక్కలు వేసారు. తీరా సినిమా చూస్తే చీదేసింది. ఓపినింగ్స్ లేవు. వీకెండ్ కూడా వర్కవుట్ కాలేదు. కలెక్షన్స్ మార్నింగ్ షో టాక్ వచ్చినప్పటినుంచి డ్రాప్ అవటం స్టార్ట్ అయ్యిందని వినికిడి. 

వాస్తవానికి ఈ సినిమా కోసం సందీప్ కిషన్ బాగా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ ని ట్రై చేయడం తో పాటు యాక్షన్స్ సన్నివేశాల కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డాడు.అయినా కూడా మైఖేల్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. కథలో విషయం లేకపోవటం,యాక్షన్ సీన్స్ లో ఎమోషన్ మిస్సవటంతో సినిమా దారుణంగా విఫలమైంది. తెలుగు లోనే కాకుండా అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ఈ సినిమా దాదాపు అదే టాక్ తెచ్చుకుంది. 
 
 గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautam Vasudev Menon), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) లాంటి పెద్ద పెద్ద నటులతో పాటు వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఇందులో మొదటిసారిగా విలన్ పాత్రలో కనపడ్డాడు. అలాగే అనసూయ (Anasuya) కూడా ఒక ప్రధాన పాత్రలో కనపడింది. వరుణ్ సందేశ్ కు కెరీర్ టర్న్ అవుతుందని భావించారు. అదీ జరగలేదు.
 
దానికి తోడు సందీప్ గత సినిమాల ప్లాఫ్ ఎఫెక్ట్ తో  ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. టాక్ బాలేకపోవడంతో సినిమా ఏ దశలోనూ నిలబడేలా కనపబడటం లేదు. తెలుగులో దాదాపుగా వాషౌట్ అయిపోయినట్లే అని ట్రేడ్ తేల్చేసింది. తమిళంలో కూడా కలెక్షన్స్ అంతంత మాత్రమే. ఈ 'మైకేల్' సినిమా కూడా. ఇదేమి కొత్త కథ కాదు, కొత్తగా చెప్పలేదు కూడా. పాత కథలే తిప్పి తిప్పి చెప్పాడు. కథ 1980-90 దశకాల్లో ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ మధ్య జరిగిన కథ. ఈ వార్ ల మధ్య అమ్మ సెంటిమెంట్, అమ్మాయి సెంటిమెంట్ కూడా ఉంటుంది. అయితే దర్శకుడు సినిమా కథ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అనిపిస్తోంది. ఎందుకంటే పైన చెప్పిన రెండు సెంటిమెంట్స్ వున్నప్పుడు దానికి తగ్గట్టుగా భావోద్వేగాలు కూడా ఉండాలి కదా (Emotions), అవి మొత్తం ఈ సినిమాలో లోపించాయి.  

click me!