నాగ్‌ బర్త్‌ డే పోస్టర్‌ .. ఆ ఇద్దరి హీరోల అభిమానుల్లో గుబులు

Published : Aug 28, 2020, 07:32 PM IST
నాగ్‌ బర్త్‌ డే పోస్టర్‌ .. ఆ ఇద్దరి హీరోల అభిమానుల్లో గుబులు

సారాంశం

 ఈ సాయంత్రం హ్యాపీ బర్త్ డే కింగ్‌ నాగార్జున యాష్‌ ట్యాగ్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగ్‌ స్పోర్ట్స్ బైక్‌పై బ్యాక్‌ కి తిరిగి తుపాకి ఎక్కుపెట్టి సీరియస్‌గా, స్టయిలీష్‌గా ఉన్న నాగ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. 

మన్మథుడు అక్కినేని నాగార్జున బర్త్ డే సందడి షురూ అయ్యింది. ఆయన పుట్టిన రోజు రేపు(శనివారం) అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సాయంత్రం హ్యాపీ బర్త్ డే కింగ్‌ నాగార్జున యాష్‌ ట్యాగ్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నాగ్‌ స్పోర్ట్స్ బైక్‌పై బ్యాక్‌ కి తిరిగి తుపాకి ఎక్కుపెట్టి సీరియస్‌గా, స్టయిలీష్‌గా ఉన్న నాగ్‌ లుక్‌ ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉంటే ఇటీవల హ్యాపీ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌లు ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇప్పటికే మహేష్‌బాబు బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. ఆరు కోట్ల ట్వీట్లలో వరల్డ్ రికార్డ్ సృష్టించగా, దాన్ని మించేలా పవన్‌ బర్త్ డే యాష్‌ ట్యాగ్‌ తో రికార్డ్ సృష్టించారు. ఏకంగా ఆరున్నర కోట్ల మంది ట్వీట్‌ చేసి ప్రపంచ రికార్డ్ ని సృష్టించారు. 

అయితే ఇప్పుడు నాగ్‌ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు హ్యాపీ బర్త్ డే కింగ్‌ నాగార్జున యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేయిస్తున్నారు. దీంతో మహేష్‌, పవన్‌ అభిమానులకు గుబులు పట్టుకుంది. తమ అభిమాన హీరోలకు ఎక్కడ మించిపోతాడేమో అని ఆందోళన చెందుతున్నారని టాక్‌. అయితే సీరియర్‌ హీరోలకు సోషల్‌ అంతగా పోటీ ఉండదు. వాళ్ళకి ఫాలోయింగ్‌ కూడా తక్కువే. కాబట్టి ఈ విషయంలో పెద్దగా టెన్షన్‌ పడాల్సిన అవసరం మహేష్‌, పవన్‌ అభిమానులకు లేదని అంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్