`తొలిప్రేమ` రీ రిలీజ్‌ ట్రైలర్‌ ఔట్‌.. దిల్‌ రాజు ఎమోషనల్‌ వర్డ్స్.. తాను ఇక్కడ ఉన్నానంటే అదే కారణమంటూ..

Published : Jun 24, 2023, 03:20 PM IST
`తొలిప్రేమ` రీ రిలీజ్‌ ట్రైలర్‌ ఔట్‌.. దిల్‌ రాజు ఎమోషనల్‌ వర్డ్స్.. తాను ఇక్కడ ఉన్నానంటే అదే కారణమంటూ..

సారాంశం

పవన్‌ కళ్యాణ్‌ నటించిన కల్ట్ క్లాసిక్‌ మూవీ `తొలి ప్రేమ`. 25ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా రీ రిలీజ్‌ చేస్తున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ నటించిన `తొలి ప్రేమ` చిత్రం 25ఏళ్ల క్రితం ఒక సంచలన చిత్రంగా నిలిచింది. లవ్‌ స్టోరీస్‌లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలవడం విశేషం. అద్బుతమైన మ్యాజిక్‌ ఈ సినిమాని బ్లాక్‌ బస్టర్‌గా మార్చింది. ఇది అప్పటి స్టూడెంట్స్ పై బలమైన ప్రభావాన్ని చూపించింది. పవన్‌ మ్యానరిజమే కాదు, కాలేజ్‌ లవ్‌ స్టోరీస్‌ పరంగానూ ఈ సినిమానే స్టూడెంట్స్ ఫాలో అయ్యేవారంటే అతిశయోక్తి కాదు. సినిమా కోసం కాలేజ్‌లు బంక్‌ కొట్టిన స్టూడెంట్స్ లెక్కే లేదు. 

పవన్‌కి అంతకు ముందే `సుస్వాగతం` సక్సెస్‌ని ఇచ్చింది. కానీ `తొలిప్రేమ` మాత్రం ఆయన్ని స్టార్‌ హీరోని చేసింది. ఈ సినిమాతో పవన్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అంతకు ముందు చిరంజీవి తమ్ముడిగానే చూసిన జనం ఈ సినిమాతో ఆయన్ని సపరేట్‌గా చూడటం స్టార్ట్ చేశారు. దర్శకుడు కరుణాకర్‌ కథ, డైరెక్షన్‌, దేవా సంగీతం ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. వీటికితోడు పవన్‌, కీర్తిరెడ్డి మధ్య లవ్‌ ట్రాక్‌ ఆడియెన్స్ హృదయాలను కొల్లగొట్టింది. 

1998లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు లవ్‌ స్టోరీస్‌లో ఓ క్లాసిక్‌ మూవీలా నిలిచిపోయింది. ఎప్పుడూ చూసినా ఫ్రెష్‌ ఫీలింగ్‌ తెచ్చే చిత్రంగా నిలుస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదలై 25ఏళ్లు అవుతుంది. జులై 24కి కరెక్ట్ గా 25ఏళ్లు. దీంతో తాజాగా ఈ సినిమా మళ్లీ రిలీజ్‌ చేస్తున్నాడు. ఇప్పుడు రీ రిలీజ్‌ సినిమాల ట్రెండ్ ఊపందుకున్న నేపథ్యంలో అందులో భాగంగా ఈ శుక్రవారం(జూన్‌ 30న) `తొలిప్రేమ`ని రీ రిలీజ్‌ చేస్తున్నారు. శ్రీ మాతా క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం మళ్లీ రిలీజ్‌ కానుండటం విశేషం.

 తాజాగా సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. 4కే రిజల్యూషన్‌తో ఈ సినిమాని రిలీజ్‌ చేస్తున్న నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్‌ సైతం ఆకట్టుకుంటుంది. ఆ నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ఈ సందర్భంగా శనివారం రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో చిత్ర దర్శకుడు కారుణాకరన్‌, చిత్ర నిర్మాత జీవీజీ రాజు(ఎస్‌ఎస్‌సి ఆర్ట్స్), పవన్‌కి చెల్లిగా నటించిన వసుకి, ఈ సినిమాతో ఆర్ట్ డైరెక్టర్‌గా పరిచయం అయిన ఆనంద్‌ సాయి, ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతోపాటు సినిమాని రిలీజ్‌ చేస్తున్న రఘురాం రెడ్డి, రవికాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. 

`తొలిప్రేమ` రీ రిలీజ్‌ ద్వారా వచ్చిన కలెక్షన్లని పవన్‌ కళ్యాణ్‌ తలపెట్టిన రైతు భరోసా యాత్రకి విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. శ్రీ మాతా క్రియేషన్స్ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ.. `ఈ సినిమాని రీరిలీజ్ చేయడానికి కారణం.. అభిమానిగా ఈ సినిమాని విడుదల చేయాలని భావించాం. ఈ సినిమాని రీరిలీజ్ చేసే అవకాశాన్ని కల్పించిన జి.వి.జి.రాజు గారికి ధన్యవాదాలు. జూన్ 30 న ఈ సినిమాని భారీగా రీరిలీజ్ చేస్తున్నాం. అందరూ చూసి ఆనందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొత్త మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం` అని తెలిపారు. 300వందలకుపైగా థియేటర్లలో రిలీజ్‌ చేయబోతున్నట్టు తెలిపారు. 

గెస్ట్ గా వచ్చి `తొలి ప్రేమ` ట్రైలర్‌ని రిలీజ్‌ చేసిన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, `తొలిప్రేమ` అనేది ఒక గొప్ప జ్ఞాపకమని, ఇందులో భాగమైన పవన్ కళ్యాణ్, కరుణాకరన్,  జి.వి.జి.రాజు అందరికీ మరిచిపోలేని జ్ఞాపకం ఈ చిత్రం. నా సినీ ప్రయాణంలో `తొలిప్రేమ`కి అంటూ ఓ ప్రత్యేక పేజీ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. అప్పటికీ ఒక్క `పెళ్లిపందిరి` మాత్రమే చేశా. జి.వి.జి.రాజు గారిని కలిసి డిస్ట్రిబ్యూషన్ గురించి అడిగాను. ఒక్క సిట్టింగ్ లోనే సినిమా కొనడం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమాతో నాకు ప్రయాణం మొదలైంది. నేను నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా, నా మనసులో ఎప్పటికీ `తొలిప్రేమ`కి ప్రత్యేక స్థానముంటుంది. 

సినిమా ప్రివ్యూ నుంచి వంద రోజుల ఫంక్షన్ వరకు ఎన్నో జ్ఞాపకాలు. వంద రోజుల ఫంక్షన్ రోజు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. అయినా ఫంక్షన్ కి కంట్రోల్ చేయలేనంతగా క్రౌడ్ వచ్చారు. ఒక చరిత్ర ఇది. అలాంటిది నేను మళ్ళీ చూడలేదు. ఇలా ఎన్నో చరిత్రలు సృష్టించిన సినిమా `తొలిప్రేమ`. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవాళ్ళు. డబ్బులు ఎప్పుడు తక్కువున్నా ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. ఏదైనా ఫ్లాప్ వస్తే, ఆ డబ్బుని వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈ సినిమాని రీరిలీజ్ చేసేవాణ్ణి. అలా మళ్ళీ మూడుసార్లు రిలీజ్ చేశాం. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నాకు అడుగులు నేర్పించిన సినిమా `తొలిప్రేమ`. అలాంటి తొలిప్రేమలో నేను భాగమైనందుకు ఎప్పటికీ గర్వపడతాను. ట్రైలర్ చూస్తుంటే మళ్ళీ ఈ సినిమా చూడాలనిపిస్తుంది` అని తెలిపారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?