బింబిసార సక్సెస్ పార్టీలో దిల్ రాజు, కళ్యాణ్ రామ్.. ఖుషీ అవుతున్న బయ్యర్లు..

By team teluguFirst Published Aug 8, 2022, 6:56 AM IST
Highlights

ఫాంటసీ, టైమ్‌ ట్రావెల్‌ ఫిల్మ్ ‘బింబిసార’ (Bimbisara) థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే చిత్రం బయ్యర్లను ఖుషీ చేస్తున్నది. దీంతో డిస్టిబ్యూటర్ తో చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ నిర్వహించింది.
 

వరుస ఫెల్యూర్స్ తో విసుగెత్తిపోయిన నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’తో ఇండస్ట్రీనే తనవైపు చూసేలా చేశాడు. బలమైన కథతో.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఆగస్టు 5న రిలీజ్ అయిన ‘బింబిసార’ అటు బాక్సాఫీస్ వద్ద కూడా ఒకే అనిపిస్తోంది. ఇప్పటికే చిత్రంపై ఆడియెన్స్ పాజిటివ్ గా  స్పందిస్తుండటంతో పాటు.. అటు సినీ తారలూ క్లాసికల్ ఫిల్మ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ‘బింబిసార’ చిత్రం కేవలం మూడురోజుల్లోనే పెట్టుబడిని  మాత్రం రాబట్టింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు  ఖుషీ అవుతున్నారు. 

బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపిస్తున్న ఈ ఫాంటసీ ఫిల్మ్ వారం పూర్తికాకుండా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. దాదాపు రూ.20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి నిన్నటి కలెక్షన్లతో పెట్టుబడి మాత్రం తిరిగి వచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో చిత్ర యూనిట్ నిన్న డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లతో చిన్న సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ రోజుతో బయ్యర్లు ప్రాఫిట్ జోన్ లోకి రాబోతుండటంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ పార్టీలో ‘బింబిసార’ డిస్ట్రిబ్యూటర్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju), నందమూరి కళ్యాణ్ రామ్, ఎంఎం కీరవాణీ, చోటా కే నాయుడు, శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు వశిష్ఠ ఉన్నారు. 

ఈ చిత్రంలో Kalyan Ram 500వ కాలంలో మహా చక్రవర్తి బింబిసారుడు పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన నటన, అదిరిపోయే విజువల్స్, స్క్రీన్ ప్లేకు ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందుతున్నాయి. డెబ్యూ దర్శకుడు వశిష్ట తొలి చిత్రంతోనే తన దర్శక ప్రతిభను చాటుకున్నాడు. కథ బలంగా ఉండటంతో ప్రస్తుతం ఆడియెన్స్ ఆసక్తి మొత్తం బింబిసారపైనే ఉంది. ఈ చిత్రంతో కళ్యాణ్ కేరీర్ ‘బింబిసార’కు ముందు.. ‘బింబిసార’కు తర్వాత అన్నట్టుగా మారిపోయింది. 
 
కళ్యాణ్ రామ్ మూవీలో డ్యూయల్ యాక్షన్ తో ఆకట్టుకోగా.. హీరోయిన్లుగా గ్లామర్ బ్యూటీలు కేథరిన్ ట్రెసా (Catherine Tresa), సంయుక్త  మీనన్ ఆడిపాడారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరిక్రిష్ణ కే చిత్రాన్ని నిర్మించారు. నటుడు ప్రకాష్ రాజ్,  శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ,  తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల,  చమ్మక్ చంద్ర కీలక పాత్రలో నటించారు. ఎంఎం కీరవాణీ అందించిన సంగీతానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  

click me!