గతంలో లాగ జనం థియేటర్ కు వచ్చి సినిమాలు చూడటం లేదని మాట్లాడారు. అయితే ఇప్పుడీ రెండు సినిమాలు సూపర్ హిట్ తో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా జనం థియేటర్ కు వస్తారని ప్రూవ్ అయ్యిందని తేలిందని అంటున్నారు. థియేటర్స్ లో సాలిడ్ అక్యుపెన్సీ ఉండటం అందరినీ ఆనందపరుస్తోంది.
ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కడ చూసినా బింబిసార, సీతారామం సక్సెస్ గురించే మాట్లాడుతున్నారు. జనం థియేటర్స్ రావటం లేదు...అసలు ఓఫినింగ్స్ లేవు, కలెక్షన్స్ లేవు అనుకున్న టైమ్ లో బింబిసార చిత్రానికి హౌస్ ఫుల్ బోర్డ్ లు పడుతున్నాయి. సీతారామం చిత్రం మల్టిప్లెక్స్ లలో అదరకొడ్తోంది. ఈ నేపధ్యంలో నిర్మాతల అందరి టార్గెట్ దిల్ రాజు అయ్యారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.
అందుకు కారణం ...దిల్ రాజు ఇండైరక్ట్ గా తన మాటలతో తెలుగు పరిశ్రమ షూటింగ్ ల బంద్ నిర్ణయం తీసుకునేలా చేయటం అంటున్నారు. తన థాంక్యూ చిత్రం థియేటర్స్ లో డిజాస్టర్ అవటం, ఎఫ్ 3 చిత్రం అనుకన్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటానికి కారణం ...ఓటిటిలని, బడ్జెట్ లు ఎక్కువ అవటం అని , హీరోలు, డైరక్టర్స్ తమ రెమ్యునేషన్స్ తగ్గించుకోవాలని అంటూ వస్తున్నారు. గతంలో లాగ జనం థియేటర్ కు వచ్చి సినిమాలు చూడటం లేదని మాట్లాడారు. అయితే ఇప్పుడీ రెండు సినిమాలు సూపర్ హిట్ తో కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా జనం థియేటర్ కు వస్తారని ప్రూవ్ అయ్యిందని తేలిందని అంటున్నారు. థియేటర్స్ లో సాలిడ్ అక్యుపెన్సీ ఉండటం అందరినీ ఆనందపరుస్తోంది.
చాలా మంది నిర్మాతలు ఇప్పుడు కళ్యాణ్ రామ్, దుల్కర్ వంటి హీరోలతోనే జనం థియేటర్స్ వస్తున్నప్పుడు మిగతా హీరోల సినిమాలను ఖచ్చితంగా ఆదరిస్తారనే ధైర్యం వచ్చిందని అంటున్నారు. అయితే మంచి కంటెంట్ ఉండాలని,షూటింగ్ లు ఆపి ఆలోచించాల్సిన పనిలేదని చెప్తున్నారు. చాలా మంది నిర్మాతలు షూటింగ్ లు ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. విక్రాంత్ రోణా లాంటి డబ్బింగ్ సినిమా సైతం హిట్ అవటం ఇండస్ట్రీకి ఊపు ఇచ్చిందనే చెప్పాలి. దానికి తోడు దిల్ రాజు ...తను విజయ్ తో చేస్తున్న వారసుడు చిత్రం షూటింగ్ ఆపకపోవటం కూడా వారికి కోపం తెప్పిస్తోంది.