యూఎస్ బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సందడి.. కలెక్షన్స్ డిటేయిల్స్..

Published : Aug 07, 2022, 06:40 PM ISTUpdated : Aug 07, 2022, 06:42 PM IST
యూఎస్ బాక్సాఫీస్ వద్ద దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సందడి.. కలెక్షన్స్ డిటేయిల్స్..

సారాంశం

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - యంగ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్  జంటగా నటించిన రొమాంటిక్ ఫిల్మ్ ‘సీతారామం’(Sita Ramam). గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం యూఎస్  కలెక్షన్స్ లో అదరగొడుతోంది.    

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - యంగ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్ టైనర్ ‘సీతా రామం’. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడం, చీఫ్ గెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హాజరవడంతో సినిమా రీచ్ మరింత పెరిగింది. రిలీజ్ తర్వాత అనుకున్నట్టుగానే సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. 

సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. తొలిరోజు రూ. 10 కోట్ల గ్రాస్ సంపాదించగా రూ.8.90 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇక రెండో రోజు కాస్తా వసూళ్లు తగ్గినా.. రూ.4.90 కోట్లతో ఒకే అనిపించుకుంది. అదేవిధంగా కలెక్షన్ల పరంగా ఈ చిత్రం యూఎస్ లోనూ దూసుకుపోతోంది. US మార్కెట్ లో ‘సీతా రామం’ చిత్రానికి 7 లక్షల డాలర్ల టార్గెట్ ఉందని టాక్ వచ్చింది. ఇది చేరుకోవడం కష్టమేనని కొందరు భావించారు. కానీ కేవలం రెండు రోజుల్లోనే 4 లక్షల డాలర్ల మార్క్ ని దాటింది. దీంతో త్వరలోనే టార్గెట్ ను రీచ్  కాబోతుందన్నారు. మొదటి వారం కలెక్షన్లు కూడా భారీగా ఉండనున్నట్టు తెలుస్తోంది.

‘సీతారామం’ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మాత అశ్వని దత్ రూపొందించారు. ఈ చిత్రం 1970ల నేపథ్యంలో సాగే ప్రేమకథ. మూవీలో హీరోహీరోయిన్లుగా దుల్కర్ సల్మాన్,  మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. ఈ చిత్రంతోనే మృణాల్ ఠాకూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ చివరిగా షాహిద్ కపూర్‌తో కలిసి హిందీ జెర్సీలో కనిపించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది. సీతా రామన్‌లో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమంత్ మరియు భూమిక చావ్లా ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. హనురాఘవపూడి దర్శకత్వం వహించగా.. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు