బిగ్ బాస్ పై దీక్ష సంచలన కామెంట్స్

Published : Sep 20, 2017, 04:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
బిగ్ బాస్ పై దీక్ష సంచలన కామెంట్స్

సారాంశం

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన దీక్ష ఒక టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన దీక్ష బిగ్  బాస్ హౌస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన దీక్ష

ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్.. మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. గత వారం దీక్ష ఎలిమినేట్ అవ్వగా..ఫైనల్స్ కి  ఐదుగురు సభ్యులు చేరుకున్నారు. ఎలిమినేట్ అయ్యి.. బిగ్ బాస్ ఇంటి నుంచి తన ఇంటికి చేరుకున్న దీక్ష.. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

 

ఇంటర్వ్యూలో.. ఇంటి సభ్యుల మీద దీక్ష చేసిన కామెంట్స్.. ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. తాను షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అర్చన తనను బ్లేమ్ చేస్తూ మాట్లాడటం బాధ కలిగిస్తోందని దీక్ష తెలిపింది. బిగ్ బాస్ షో కి రాకముందు తాను ధనరాజ్ తో కలిసి బంతి పూల జానకి సినిమాలో చేశానని చెప్పిన దీక్ష.. అప్పుడు తనను ధనరాజ్.. బయట కలుద్దామని అడిగేవాడని.. అందుకు తాను అంగీకరించలేదని చెప్పింది.

 

ఆ కారణం వల్లనే.. ధనరాజ్.. హౌస్ లో ఉన్నంత కాలం తనను టార్గెట్ చేసి మరీ ఇబ్బంది పెట్టాడని దీక్ష తెలిపింది. ఇక బిగ్ బాస్ షోలో.. ఎప్పుడూ తాను తినేది, నిద్రపోయేది, ఏడ్చే సీన్లు మాత్రమే చూపించారని దీక్ష ఆవేదన వ్యక్తం చేసింది.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు