బిగ్ బాస్ కు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్న పవన్ ఫ్యాన్స్

Published : Sep 20, 2017, 03:35 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
బిగ్ బాస్ కు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్న పవన్ ఫ్యాన్స్

సారాంశం

చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ షో విజేతగా ఎవరు నిలుస్తారని సర్వత్రా ఉత్కంఠ బిగ్ బాస్ షోకి ట్విస్ట్ ఇస్తున్న పవన్ ఫ్యాన్స్

ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బుల్లితెర తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్.. చివరి దశకు చేరుకుంది.మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ షో విజేత ఎవరో తెలియనుంది.  చివరి వారానికి శివబాలాజీ, నవదీప్, ఆదర్శ్, హరితేజ, అర్చనలు చేరుకున్నారు. వీరిలో మొన్నటి వరకు హరితేజ విన్నర్ గా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా షోకి పవన్ ఫ్యాన్స్ ట్విస్ట్ ఇస్తున్నారు.

 

ఫైనల్స్ కి చేరుకున్న ఈ ఐదుగురు సభ్యుల్లో ఒకరు పవన్ అభిమాని ఉన్నారని.. ఆ వ్యక్తిని కచ్చితంగా గెలిపించాలని వాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఆ వ్యక్తి మరెవరో కాదని శివబాలాజీ అని ప్రస్తుతం ప్రచారం ఊపందుకుంది. శివబాలాజీ.. పవన్ తో కలిసి కాటమరాయుడు, అన్నవరం సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాకుండా శివబాలాజీకి..పలు సినిమాల్లో అవకాశాలు పవన్ ఇప్పించాడట.

 

శివ బాలాజీ, మధుమిత ల ప్రేమ వివాహానికి పవన్ మద్దతుగా నిలిచాడట. అందుకునే పవన్ అభిమాని కావడంతో శివ బాలాజీకి అందరూ ఓట్లు వేసి గెలిపించాలనే నిశ్చయానికి వచ్చారట. మరో వైపు శివ బాలాజీ భార్య మధుమిత కూడా అతని గెలుపు కోసం తన దైన శైలిలో ప్రచారం చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే శివ బాలాజీ గెలుపు తథ్యమనిపిస్తోంది.

 

PREV
click me!

Recommended Stories

నారి నారి నడుమ మురారి ఫస్ట్ రివ్యూ, శర్వానంద్ సినిమాకు సెన్సార్ చిక్కులు, సినిమా ఎలా ఉందంటే?
డేటింగ్ యాప్ లో మొదటి అనుభవం, అతడితో 8 గంటలు గడిపా.. నటి బోల్డ్ కామెంట్స్ వైరల్