సాయి తేజు మొహం చూపకపోవటం వెనక కారణం ఉందా?

Surya Prakash   | Asianet News
Published : Oct 21, 2021, 12:32 PM IST
సాయి తేజు మొహం చూపకపోవటం వెనక కారణం ఉందా?

సారాంశం

 సాయి ధరమ్ తేజ్‌ను కలిసి ఎన్నో ముచ్చట్లు పెట్టానని అన్నాడు. అంతే కాకుండా త్వరలోనే రాబోతోన్నాడు.. కుమ్మేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఓ ఫోటోను షేర్ చేశాడు.ఇందులో తేజు మొహాన్ని మాత్రం చూపించలేదు. చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నట్టు, భరోసా ఇచ్చినట్టు పరోక్షంగా చెప్పేశాడు.

ఇసుక వల్ల బైక్ స్కిడ్ అయి  మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురవ్వడం, అలా దాదాపు రెండు మూడు వారాలు బెడ్డు మీద Sai Dharam Tejకు చికిత్స అందించడంతో అభిమానులు ఆందోళన చెందారు.  రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్  హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా కోలుకుంటున్నారు. ఓ వైపు దసరా, మరో వైపు సాయి ధరమ్ తేజ్ బర్త్ డే, ఇంకో వైపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడంతో మెగా కుటుంబల్లో ఆనందం మొదలైంది. 

సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్డేట్ ఇస్తూ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు సపరేట్‌గా పోస్ట్‌లు చేశారు. అయితే ఇప్పటిదాకా సాయి ధరమ్ తేజ్ ఫోటో మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. తాను బాగున్నాను అంటూ అప్డేట్ ఇస్తూ థమ్సప్ సింబల్ మాత్రం పెట్టేయటం అందరిలో అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. ఎందుకని ఫేస్ మాత్రం చూపించటం లేదంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై చర్చలు మొదలెట్టేసారు కొందరు అభిమానులు. 

కొందరైతే ఓ అడుగు ముందుకేసి సాయి తేజు మొహానికి ఏమన్నా దెబ్బలు తగిలాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అది హీల్ అవటానికి కాస్త టైమ్ పడుతుంది కాబట్టి, పూర్తిగా పాత రూపం వచ్చేదాకా ఫొటోలలో చూపించరు అంటున్నారు. అయితే నిజమేంటనేది ఎవరికీ తెలియదు. ఎవరో ఆ కుటుంబానికి చెందిన వాళ్లు చెప్పాల్సిందే అఫీషియల్ గా. అప్పటిదాకా సోషల్ మీడియాలో ఈ స్పెక్యులేషన్స్ చూడక తప్పవు. ఏదైమైనా సాయి తేజ కోలుకోవటం అందరికీ ఆనందం కలిగించే విషయం. 

ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు హరీష్ శంకర్ సుప్రీమ్ హీరోను కలిశాడు. సాయి ధరమ్ తేజ్‌ను కలిసి ఎన్నో ముచ్చట్లు పెట్టానని అన్నాడు. అంతే కాకుండా త్వరలోనే రాబోతోన్నాడు.. కుమ్మేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఓ ఫోటోను షేర్ చేశాడు.ఇందులో తేజు మొహాన్ని మాత్రం చూపించలేదు. చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నట్టు, భరోసా ఇచ్చినట్టు పరోక్షంగా చెప్పేశాడు.

also read: సాయి ధరమ్ సూపర్ ఫిట్... ఆసక్తిరేపుతున్న దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్

ఇక తేజూ డిశ్చార్జ్ అయ్యాడు.. క్షేమంగా ఉన్నాడు.. దసరా రోజునే ఇలా మా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని Chiranjeevi పేర్కొన్నాడు. ఇక తేజు ఆరోగ్యం కోసం ఎంతో మంది ప్రార్థనలు, పూజలు చేశారు.. వారి ప్రార్థనలు ఫలించాయని Pawan Kalyan అన్నాడు. మొత్తానికి సాయి ధరమ్ తేజ్ కోలుకుని ఇంటికి రావడంతో అభిమానులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

also read: అభిమానులకు మళ్లీ షాకివ్వబోతున్న పవన్‌.. సినిమాలకు ఫుల్‌ టైమ్‌ బ్రేక్‌? నిర్మాతల్లో టెన్షన్‌..
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు