నటుడు వైవా హర్ష వివాహం.. హాజరైన చిత్ర ప్రముఖులు

Published : Oct 21, 2021, 10:16 AM IST
నటుడు వైవా హర్ష వివాహం.. హాజరైన చిత్ర ప్రముఖులు

సారాంశం

వరుడు హర్షతో సెల్ఫీ దిగిన Director Maruthi... ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. గాడ్ బ్లెస్ యు .. అంటూ విషెష్ తెలియజేశారు. 

కమెడియన్ వైవా హర్ష వివాహం ఘనంగా జరిగింది. నిన్న హైదరాబాద్ లో హర్ష వివాహం జరిగినట్లు సమాచారం. viva Harsha వివాహానికి చిత్ర పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు మారుతి, నిర్మాత ఎస్ కె ఎన్ తో పాటు కమెడియన్ ప్రవీణ్ పెళ్ళిలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Also read అవినాష్ మెహందీ వేడుకలో యాంకర్ శ్రీముఖి సందడి... వైరల్ గా ఫోటోలు
వరుడు హర్షతో సెల్ఫీ దిగిన Director Maruthi... ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. గాడ్ బ్లెస్ యు .. అంటూ విషెష్ తెలియజేశారు. వరుడిగా హర్ష పెళ్లి బట్టలలో మెరిసిపోయారు. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన హర్ష చెముడు... ఒక్క వీడియోతో సూపర్ పాప్యులర్ అయ్యాడు. వైవా కాన్సెప్ట్ తో విడుదలైన షార్ట్ ఫిల్మ్ భయంకరంగా వైరల్ అయ్యింది. దానితో హర్ష కాస్త వైవా హర్ష అయ్యాడు. 

Also read జబర్దస్త్ అవినాష్ పెళ్లి... హాజరైన బిగ్ బాస్ సెలబ్రిటీలు!

2014లో విడుదలైన మై నే ప్యార్ కియా చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు హర్ష. 2020లో విడుదలైన కలర్ ఫోటో చిత్రంలో హీరో సుహాస్ మిత్రుడిగా హర్ష అద్భుత నటన కనబరిచాడు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 
 

PREV
click me!

Recommended Stories

దళపతి విజయ్ అసలు పేరు ఏంటో తెలుసా? ఆయన ఏం చదువుకున్నాడు, ఎలా హీరో అయ్యాడు?
ప్రభాస్, పవన్ కళ్యాణ్ టాప్ సీక్రెట్ బయటపెట్టిన యాంకర్ సుమ, షాక్ లో అభిమానులు..