
సినిమా ఇండస్ట్రీలో వారసులు అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. ప్రస్తుతం టాప్ హీరోలుగా ఉన్నవారిలో చాలా మంది వారసులుగా వచ్చిన వారే. తాజాగా మరో వారసుడు ఇండస్ట్ర్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఆయన తమిళ హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్. శివపుత్రడు, అపరిచితుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ‘చియాన్’ విక్రమ్. తెలుగు లో ఒకటీ రెండు సినిమల్లో నటించిన విక్రమ్ కి పెద్దగా పేరు రాలేదు. తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ హీరోకి వరుస విజయాలు రావడంతో ఒక్కసారే స్టార్ హీరోగా మారిపోయాడు.
ఇప్పుడు ఆయన కుమారుడు ధ్రువ్ తెరంగేట్రం చేయనున్నారు. తెలుగులో ఇటీవల విడుదలై భారీ విజయం సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి సినిమాని తమిళంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ రెడ్డి పాత్రలో ధ్రువ్ కనిపిస్తారట. ఈ విషయాన్ని విక్రమ్ స్వయంగా వెల్లడించారు. ‘రెడీ టు మేక్ ద లీప్. ధ్రువ్ టు బి అర్జున్‌రెడ్డి’ అని తనయుడి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో విక్రమ్ పోస్ట్ చేశారు. మరి అర్జున్ రెడ్డి పాత్రలో ధ్రువ్ ఎంత మేరకు మెప్పిస్తారో చూడాలి.