Dhootha2కి హింట్‌ ఇచ్చిన నాగచైతన్య.. అధికారిక ప్రకటన అప్పుడే..

Published : Mar 18, 2024, 10:30 AM IST
Dhootha2కి హింట్‌ ఇచ్చిన నాగచైతన్య.. అధికారిక ప్రకటన అప్పుడే..

సారాంశం

నాగచైతన్య ప్రస్తుతం `తండేల్‌` మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ని ప్రకటించాడు. ఈ మేరకు వీడియోని విడుదల చేయగా అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నాగచైతన్య నటించిన వెబ్‌ సిరీస్‌ `దూత` ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ పొందింది. ఓటీటీలో ఇది దుమ్మురేపింది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె కుమార్‌ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ హిట్‌ కావడంతో ఇప్పుడు సెకండ్‌ సీజన్‌ తీసుకురాబోతున్నారు. తాజాగా నాగచైతన్య హింట్‌ ఇచ్చారు. చెప్పకనే చెప్పేశాడు. చైతూ లేటెస్ట్ గా ఓ వీడియోని పంచుకున్నారు. ఇందులో ఆయన ఓ రూమ్‌లో న్యూస్‌ పేపర్‌ చదువుతూ కనిపించారు. 

పేపర్‌ తిప్పేస్తూ `కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా.. మీకు ఇంకా క్లూస్‌ కావాలా? అయితే మార్చి 19 వరకు వెయిట్‌ చేయండి అని తెలిపారు. రేపు మంగళవారం దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందని వెల్లడించింది. అదే `దూత2` అనౌన్స్ మెంట్‌ అని తెలుస్తుంది. ఎందుకంటే `దూత` న్యూస్‌ పేపర్‌ చుట్టూ జరిగేకథ. అందుకే చైతూ ఇలా న్యూస్‌ పేపర్‌తో హింట్‌ ఇచ్చేశాడు. చెప్పకనే అసలు విషయం చెప్పేశాడు. 

ఇక `దూత`లో చైతూ ఓ న్యూస్‌ పేపర్‌ హోనర్‌గా కనిపించాడు. ఆయన న్యూస్‌ పేపర్‌ క్లిప్పులు చూస్తాడు. వాటిలో తన జీవితంలో నెక్ట్స్ జరగబోయేది వార్తగా వచ్చి ఉంటుంది. దాన్నుంచి తప్పించుకునేందుకు ఆయన పడే స్ట్రగుల్స్, దాన్ని ఆపే ప్రయత్నం ఈ క్రమంలో చోటు చేసుకున్న ఉత్కంఠభరిత సన్నివేశాల సమాహారమే `దూత` సిరీస్‌. ఇది మిస్ట్రరీ హర్రర్‌ థ్రిల్లర్‌గా దర్శకుడు విక్రమ్‌ రూపొందించారు. ఫస్ట్ పార్ట్ పెద్ద హిట్‌ కావడంతో సెకండా సీజన్‌ని తీసుకురాబోతున్నారు. 

ఇక ప్రస్తుతం నాగచైతన్య.. `తండేల్‌` సినిమాలో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. మత్య్సకారుల జీవితాల నేపథ్యంలో పోర్ట్ బ్యాక్‌ డ్రాప్‌లో యాక్షన్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరాకి విడుదల కాబోతుంది. 

Read more: అనుష్క శెట్టి నో అంటే.. త్రిష సై అన్నది.. తండ్రి పాత్రకి జోడీగా స్టార్‌ హీరోయిన్‌

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?